బంగారంపై ఆ పథకం.. నోరు విప్పిన కేంద్రం

CENTER ON GOLD TAX

బ్లాక్ మనీ తరహాలో బ్లాక్ గోల్డ్ కూడా బయటకు తీయాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోందని చాలా పెద్ద ఎత్తున వార్తలు బయటకు వచ్చాయి . ఈ నిర్ణయంతో ఎంత నల్ల బంగారం బయటపడుతుందో అన్న ఆసక్తి కొందరిదైతే ఇంట్లో ఉన్న బంగారానికి లెక్క ఎలా చూపించాలి అన్న టెన్షన్ మరికొందరిది . వారసత్వంగా వచ్చిన బంగారానికి లెక్కలు లేవు. రసీదులు అంతకన్నా ఉండవు. ఇక మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు రసీదుల కోసం తలపట్టుకునే పరిస్థితి ఎదురైందని వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి.
బంగారంపై ప్రధాని మోదీ త్వరలో మరోమారు పెద్ద నోట్ల రద్దు తరహాలో నల్ల బంగారాన్ని వెలికితీసే ప్రయత్నం  చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ పెదవివిప్పింది. పరిమితికి మించి బంగారం ఉంటే.. స్వచ్ఛందంగా వెల్లడించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ సరికొత్త పథకాన్ని తీసుకొస్తుందంటూ గత రెండు రోజులుగా వార్తలు షికార్లు కొడుతున్నాయి.

నల్లధనాన్ని బంగారం రూపంలో దాచుకునేవారికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త క్షమాభిక్ష పథకానికి రూపకల్పన చేస్తున్నట్లు ఈ వార్తల సారాంశం. పరిమితికి మించి బంగారం ఉంటే స్వచ్ఛందంగా తెలియజేసేలా ఈ పథకాన్ని అమలు చేయబొతున్నారని.. దీని ప్రకారం.. పరిమితికిమించి బంగారం ఉన్నవాళ్లంతా దానిని బయటపెట్టి, అందుకు తగినంత పన్ను చెల్లించాల్సి ఉంటుందంటూ ప్రచారం జరిగుతోంది. అయితే ఈ ప్రచారం దేశ వ్యాప్తంగా వైరల్ కావడంతో ఇవాళ కేంద్ర ఆర్థికశాఖ దీనిపై స్పందించింది. అసలు బంగారంపై  క్షమాభిక్ష పథకం తీసుకురావాలన్న ప్రతిపాదనేదీ ప్రస్తుతం లేదని క్లారిటీ ఇచ్చింది. సాధారణంగా బడ్జెట్‌ తయారీ సందర్భంగా ఇలాంటి ఊహాగానాలు రావడం సహజమేనంటూ సంబంధిత అధికారులు పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతానికి ఈ బంగారంపై నెలకొన్న టెన్షన్‌కు తాత్కాలిక ఉపశమనం కలిగినట్లే. కానీ భవిష్యత్తులో మాత్రం ఇలాంటి పథకం పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు విశ్లేషకులు.

NATIONAL NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *