ఎన్నికల వరాలు ప్రకటించిన కేంద్ర బడ్జెట్

Central Government Announced the Election Gifts

సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ప్రజా క్షేత్రంలో బీజేపీ కి వ్యతిరేకత బాగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌‌ను చక్కగా ఉపయోగించుకోవాలని అనుకుంది. బడ్జెట్‌ లో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేసింది. బడ్జెట్‌లో ఎన్నికల వరాలు ప్రకటించింది. పేద రైతులు, అసంఘటిత రంగ కార్మికులపై వరాల జల్లు కురిపించారు. జీఎస్టీలో వస్తుందని అనుకున్న డబ్బు అంతగా రాలేదు…దేశంలో పలు పరిణామాలు ప్రభుత్వానికి ఆందోళనకరంగా మారుతున్న నేపధ్యంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ తో ప్రజల మనసులో స్థానం కోసం ప్రయత్నం చేస్తుంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ .

బడ్డెట్ 2019లో కేంద్రం ఎన్నికల వరాలు ప్రకటించింది. ప్రధానమంత్రి శ్రయయోగి బంధన్ పేరుతో అసంఘటిత కార్మికులకు కొత్త పింఛన్ పథకాన్ని తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. 60 ఏళ్లు నిండినవారందరికీ నెలకు రూ.3వేలు పింఛన్ వస్తుందని వెల్లడించారు. ప్రకృతి విపత్తులకు నష్టపోయే రైతులకు 2 శాతం వడ్డీరాయితీ. ఎన్‌పీఎస్‌లో 4 శాతం అదనంగా జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పేరుతో రైతులకు ప్రత్యేక ఆర్థికసాయం ప్రకటించారు. ఐదు ఎకరాల్లోపు ఉన్న ప్రతి రైతుకు ఏటా రూ.6వేలు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. రూ.2వేలు చొప్పున మూడు వాయిదాల్లో ఈ నగదును నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు.అసంఘటిత రంగ కార్మికులకు కనీస పెన్షన్ పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి ప్రధాన మంత్రి శ్రమయోగి యోజన పథకం అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. నెలకు * రూ. 15వేలు జీతం వచ్చే కార్మికులందరికీ పీఎంఎస్‌వైఎం కింద లబ్ది చేకూరనుంది. జీఎస్టీ కింద నమోదైన చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 2 శాతం వడ్డీ రాయితీ ప్రకటించారు. మహిళా ఉద్యోగులకు మెటర్నటీ సెలవులను 26 వారాలకు పెంచారు. ఇకపై రూ. 21వేల జీతం వచ్చే వారికి ఈఎస్ఐ వర్తింపు ఉంటుందని మంత్రి పీయూష్ గోయల్ సభకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *