పోలవరం ప్రాజెక్ట్ పై ఏపీ సర్కార్ కు కేంద్రం షోకాజ్ నోటీసులు

Central shokaz notice on polavaram project

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పోలవరం ప్రాజెక్టుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మొన్నటికి మొన్న ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర జన శక్తి వనరుల మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ విషయంలో సమయంతో పాటు, డబ్బు కూడా వృథా అవుతుందని కేంద్రమంత్రి లోక్ సభ వేదికగా పేర్కొన్నారు. ఇక ఇప్పుడు తాజాగా కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ఏపీకి చెందిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరానికి మళ్లీ బ్రేకులు పడే పరిస్థితి నెలకొంది.
పోలవరం నిర్మాణంపై ఏపీ సర్కార్ కు కేంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పర్యవరణ నింబంధనలను ప్రస్తావిస్తూ దానిపై వివరణ కోరింది. ఈ ప్రాజెక్టు విషయంలో పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో ఏపీ సర్కార్ కు వివరణ ఇవ్వాలని పేర్కొంది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుపై కూడా కేంద్రం వివరణ కోరింది.
పోలవరంతో పాటు దాని అనుబంధ ప్రాజెక్టులపై తనిఖీలు జరిపించిన పర్యావరణ శాఖ అధికారులు ప్రాజక్టు నిర్మాణం విషయంలో పర్యావరణ అనుమతుల నిబంధనల్లో ఉల్లంఘనలు జరిగాయని తేల్చారు. కాగా, ‘పోలవరం’, దాని అనుబంధ ప్రాజెక్టులపై తనిఖీల అనంతరం చెన్నై పర్యావరణ శాఖ అధికారులు సంబంధిత నివేదికలను కేంద్రానికి అందజేశారు. పర్యావరణ అనుమతుల నిబంధనల్లో ఉల్లంఘనలు జరిగాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతులను నిబంధనల ఉల్లంఘన చేసినట్లుగా ఇచ్చిన రిపోర్టు ఆధారంగా గత జులై నెలలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఇక దీంతో ఏపీ సర్కార్ కు నోటీసులు నోటీసులు జారీ అయ్యాయి. ఈ ప్రాజెక్టు విషయంలో పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడో వివరణ ఇవ్వాలని పేర్కొంది కేంద్రం.
పోలవరానికి ఇటీవలే స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌ను రెండేళ్ల పాటు పొడిగించిన కేంద్రం.. మళ్లీ అనూహ్యంగా షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. తాజా పరిణామం ఏపీ సర్కార్ కు ఏమాత్రం మింగుపడటం లేదు. అయితే దీనిపై ఏపీ సర్కార్ వివరణను బట్టి ఈ ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంది.

 

Related posts:

ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ఉన్నావ్ రేప్ కేస్...
టిక్ టాక్ లో వీడియో చేసి....
నిందితులకు 14 రోజుల రిమాండ్
ప్రియాంక రెడ్డి హత్య..షాద్‌నగర్ లో ఉద్రిక్తత
బ్రేకింగ్ న్యూస్.. అచ్చెన్నాయుడుకు కారు ప్రమాదం
ప్రియాంకా రెడ్డి హత్య కేసు నిందితులను కోర్టుకు...
తిరుమల కొండపై ప్రైవేట్ హోమం
ప్రియాంకా రెడ్డి హత్యపై జాతీయ మహిళా కమీషన్ సీరియస్
ప్రియాంక కేసులో నిందితులు వీరే...మంత్రి తలసాని పరామర్శ
ఫోటోల కోసం ఫోజులివ్వడానికి వచ్చావా
ఆర్టీసీ కార్మికులను చేర్చుకుంటాం: కేసీఆర్
ప్రియాంక స్కూటీ పంచర్ చేశారా? వారి పనేనా?
ప్రియాంక రెడ్డి హత్య కేసులో 15 బృందాలతో గాలింపు
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి సజీవ దహనం
జార్జ్‌ చనిపోవడానికి ముందు ఎం జరిగిందంటే...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *