దిశ ఘటనతో మహిళల రక్షణ కోసం కీలక నిర్ణయం

25
Centre Decision Womens Protection
Centre Decision Womens Protection

Centre Decision Womens Protection

దిశ గ్యాంగ్ రేప్, మర్డర్  దేశాన్ని కుదిపేయడం, ఇటీవల కాలంలో మహిళలపై దాడులు రోజు రోజుకూ పెరిగిపోతుండడంతో కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా మహిళలపై దాడుల విషయంలో అన్ని రాష్ట్రాలనూ కఠినంగా వ్యవహరించాల్సిందిగా కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు పంపారు.మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల కేసులను తీవ్రంగా పరిగణించాలని, వీటి విషయంలో అలసత్వం వహించకుండా 2 నెలల వ్యవధి లోపే విచారణ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అందులో సూచించారు. మహిళల రక్షణ అంశాన్ని రాష్ట్రాలు అత్యంత ప్రధాన  అంశంగా తీసుకోవడమే కాకుండా, ఇందుకు సంబంధించి కేంద్రానికి కూడా సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు.
Centre Decision Womens Protection,disha murder, encounter, central government , home ministry ,ajay kumar balla,Womens Protection In India,All States Will Pretect To Womens

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here