తెలంగాణకి అన్యాయం బీజేపీకి అలవాటే

6
Centre Injustice to TState
Centre Injustice to TState

Centre Injustice to TState

తెలంగాణకి అన్యాయం చేయడం కేంద్రంలోని బీజేపీకి అలవాటుగా మారిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు లాగే కాజీపేట రైల్ కోచ్ ప్రాజెక్టుకి బిజెపి మంగళం పాడిందన్నారు.  చాలా కాలం నుండి రైల్ కోచ్ ఫ్యాక్ట‌రీ డిమాండ్ ఉందని గుర్తు చేశారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పలుమార్లు కేంద్రాన్ని సీఎం కేసీఆర్ కోరిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రం కోరిన విధంగా 150 ఎకరాల విలువైన భూమిని సేకరించి కోచ్ ఫ్యాక్టరీ కోసం రాష్ట్రం అప్ప‌గించిందని.. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు తెలంగాణకు దక్కాల్సిన రాజ్యాంగ బద్ధమైన హక్కు అని వివరించారు. రైల్ కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల కోరిక అన్నారు. తెలంగాణకు దక్కాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం ఉద్యమిస్తామని వివరించారు. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో కేంద్రాన్ని, బీజేపీని నిల‌దీస్తామన్నారు.

ఇప్పుడు బీజేపీ తెలంగాణ‌ ప్ర‌జ‌ల‌కు సమాధానం చెప్పాలని..  ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు.  ఇంకా ఎన్ని అబ‌ద్ధాలు అడ‌తారు? ప‌్ర‌జ‌ల‌న్ని ఎంత‌కాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. బీజేపీ అంటే భారతీయ బొంకుడు పార్టీ అని తేలిపోయిందన్నారు. టీఆరెఎస్ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణం చేస్తుంటే, బీజేపీ అబద్ధాల పునాదుల మీద అధికారం కోసం అర్రులు చాస్తున్నదని విమర్శించారు. ఇప్ప‌టి దాకా బీజేపీ బండి, గుండు, తొండి మాట‌ల‌తో ప్ర‌జ‌ల చెవుల్లో పువ్వులు పెట్టారన్నారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర బిజెపి చెవుల్లో కేంద్రం పువ్వులు పెట్టిందని ఎద్దేవా చేశారు.

errabelli attack on bjp

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here