కేంద్ర ప్యాకేజీ డొల్ల

Centre Fake Package

కేంద్రం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్ డొల్ల అని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. సోమవారం ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ సర్వే సంస్థలు విమర్శలు చేస్తున్నాయని తెలిపారు. కేంద్రం ప్యాకేజి ఫ్యూడల్ విధానంలో ఉందని దుయ్యబట్టారు. రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలని తాము అడిగామని, కేంద్రం 2 శాతం మాత్రమే ఎఫ్ ఆర్ బీఎమ్ ను పెంచిందన్నారు. కేంద్రం పెంచిన ఎఫ్ ఆర్ బిఎమ్ వల్ల రాష్ట్రాలకు ఎలాంటి లాభం లేదని విమర్శించారు. ఫెడరల్ వ్యవస్థ అవలంబించాల్సిన పరిస్థితి కాదన్నారు. కేంద్రం ప్యాకేజి వల్ల 20వేల కోట్లు మాత్రమే షరతులతో వస్తాయని అన్నారు. ఇలాంటి ప్యాకేజీ ప్రకటించి కేంద్రం తన పరువును తానే తీసుకుందని విమర్శించారు. ఇది పచ్చి మోసం దగా అని విరుచుకుపడ్డారు. రాష్ట్రాల పై కేంద్రం ఇలా పెత్తనం చాలాయించడం కరెక్టు కాదన్నారు.

 

CM KCR Attacked Modi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *