మనసున్న చదలవాడ..

17
Chadavala supported a distributor
Chadavala supported a distributor

Chadavala supported a distributor

ప్రముఖ నిర్మాత, దర్శకుడు చదలవాడ శ్రీనివాస్ రావుకు తెలుగు చిత్రసీమలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన మంచి మనసు గల వ్యక్తి అని సన్నిహితులు చెబుతుంటారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే ఆదుకుంటారనేది ఫిలింనగర్లో టాక్. తాజాగా, ఆయనో నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ ని ఆర్థికంగా ఆదుకున్నారు. గచ్చిబౌలి సన్ షైన్ ఆస్పత్రిలో బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చికిత్స పొందుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన రత్న ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్ దిలీప్ సింగ్ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకున్న ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు రూ. 50,000 ఆర్థిక సాయం చేశారు. ఆయన ఈ మొత్తాన్ని  ఈవీఎన్ చారీ, మోహన్ గౌడ్ ల ద్వారా మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా దిలీప్ సింగ్, వారి అబ్బాయి జితేష్ లు చదలవాడకు కృతజ్ఞతలు తెలియజేశారు.

#Tollywood Latest Movies 2021

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here