మెగాస్టార్‌తో అవ‌కాశం… ముగ్గురిలో ఎవ‌రికో

Chance For Chiranjeevi

చిరంజీవి ఆ మ‌ధ్య ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టి `ఇక సినిమాల‌కు దూర‌మైన‌ట్టే` అని అన్న‌ప్పుడు `ఆయ‌న‌తో ఒక్కటంటే ఒక్క సినిమా చేయ‌లేక‌పోయాం` అని బాధ‌ప‌డ్డ‌వారు ఎంద‌రో. ఆయ‌న మ‌ళ్లీ సినిమాల్లోకి పునఃప్ర‌వేశించిన‌ప్పుడు అంద‌రిక‌న్నా ఆనందం వ్య‌క్తం చేసింది హీరోయిన్లే. త‌మ ఖాతాలో మెగాస్టార్ న‌టించిన ఒకే ఒక్క సినిమా ఉంటుంద‌ని. ఆయ‌న రీ ఎంట్రీతో ఆ అవ‌కాశాన్ని అందిపుచ్చుకుంది కాజ‌ల్‌. ఇప్పుడు త‌మ‌న్నా, న‌య‌న‌తార కూడా త‌మ అదృష్టానికి పొంగిపోతున్నారు. మ‌రి ఆయ‌న నెక్స్ట్ సినిమాలో ఆ అవ‌కాశాన్ని ఎవ‌రు అందిపుచ్చుకోనున్నారు?  ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో ఇదే హాట్ టాపిక్‌. ప్ర‌స్తుతం సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో `సైరా న‌ర‌సింహారెడ్డి` చేస్తున్న చిరంజీవి ఈ ఏడాది జూన్ నుంచి కొర‌టాల శివ సెట్‌కు చేరుకుంటారు. ఈ సినిమాను మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తో క‌లిసి కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ నిర్మించ‌నుంది. ఈ సినిమాలో ప్ర‌ధాన నాయిక‌గా న‌య‌న‌తార‌, అనుష్క పేర్లు వినిపించాయి. న‌య‌న‌తార ఇప్పుడు `సైరా`లో న‌టిస్తుండ‌గా, అనుష్క ఇదివ‌రకే `స్టాలిన్‌`లో మెగాస్టార్‌తో ఆడిపాడింది. వారిద్ద‌రికీ మెగాస్టార్ సినిమా కొత్త కాదు. అయితే కీర్తి సురేష్ కు మాత్రం త‌ప్ప‌కుండా కొత్తే. ఇటీవ‌ల `మ‌హాన‌టి`తో త‌న మెటీరియ‌ల్ ప్రూవ్ చేసుకున్న కీర్తి అటు మెగాస్టార్ ప‌క్క‌న కూడా హుందాగా బాగానే సూట్ అవుతుంది. అందుకే ఆమెను తీసుకుంటే బావుంటుంద‌ని అనుకుంటున్నార‌ట కొర‌టాల‌. ఒక కీల‌క పాత్ర‌కు ఇప్ప‌టికే శ్రుతీహాస‌న్‌ను సెల‌క్ట్ చేసిన ఆయ‌న ప్ర‌ధాన నాయిక‌గా న‌య‌న‌తార‌, అనుష్క‌, కీర్తిలో ఎవ‌రిని సెల‌క్ట్ చేస్తారో, ఆ అదృష్టం ఎవ‌రికి ద‌క్కుతుందో అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *