ఛలో పల్నాడు ..టీడీపీ నేతల అరెస్ట్ లపై భగ్గుమన్న చంద్రబాబు

Spread the love

CHANDRA BABU ANGRY ON TDP LEADERS ARREST

ఏపీలో టీడీపీ ఛలో పల్నాడు నిర్వహించనున్న నేపధ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. అనుమతి లేని ర్యాలీలు చెయ్యరాదని పోలీసులు ఎక్కడికక్కడ టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునే హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా శాంతియుత ర్యాలీ నిర్వహించాలని భావిస్తే అది కూడా అడ్డుకోవటం వైసీపీ అరాచక పాలనకు నిదర్శనం అన్నారు చంద్రబాబు. రాష్ట్ర, జిల్లాల పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ‘ఛలో ఆత్మకూరు’ నిర్వహించి టీడీపీ శ్రేణులకు భరోసా ఇవాలని భావిస్తే ఆ కార్యక్రమం అడ్డుకోవడంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు టీడీపీ నేతల నిర్బంధం విషయంలో పోలీసుల తీరు దారుణం అని ఆయన అన్నారు. ఇక అరెస్ట్ లపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు అరెస్ట్‌లను ఖండించారు. ఇక ఇలా భయభ్రాంతులకు గురి చెయ్యటం ద్వారా , నిర్బంధం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరన్నారు.

శాంతి యుతంగా తాము చేస్తున్న నిరసనలను, ర్యాలీలను అడ్డుకోవటం దారుణం అని ఆయన మండిపడ్డారు. ప్రశ్నించే గొంతును నొక్కడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఒక చీకటి రోజు అన్న చంద్రబాబు ఇదొక నిరసన దినంగా అభివర్ణించారు. వైసీపీ అరాచక పాలనకు ఇదే సాక్ష్యం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక బాధిత టీడీపీ వర్గీయుల గురించి మాట్లాడిన ఆయన వారి పట్ల ప్రభుత్వం చాలా నిర్దయగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పునరావాస శిబిరానికి ఆహారం సరఫరా అడ్డుకుంటారా అని ప్రశ్నించిన చంద్రబాబు ఇంత నిరంకుశత్వమా అని నిలదీశారు . గుంటూరులోని పునరావాస శిబిరంలో బాధితులకు ఇచ్చే ఆహారం అడ్డుకోవడం అమానుషమని చంద్రబాబు వాపోయారు. ఆహారం అందించడానికి వచ్చిన వాళ్లను వెనక్కి పంపేస్తారా, కనీసం ఆహరం కూడా ఇవ్వకుండా వారిని హింసిస్తారా అని ప్రశ్నించారు. నిరంకుశ పాలనలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? అని చంద్రబాబు నిలదీశారు. వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఇలాంటి అరాచకాలు పునరావృతం కారాదన్నారు. ఎంతగా అణచివేతకు గురి చేసినా వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడే రోజు తప్పక వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక ఛలో ఆత్మకూరు కార్యక్రమం కోసం సిద్ధం అయిన కీలక టీడీపీ నేతల అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున శ్రేణులతో బయలుదేరిన దేవినేని అవినాష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. చంద్రబాబుని హౌస్ అరెస్ట్ చేశారు. ఛలో పల్నాడు కార్యక్రమం భగ్నం చెయ్యటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

TDP LEADERS ARREST IN AP

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *