చంద్రబాబును టెన్షన్ పెడుతున్న మచ్చా

Chandra Babu Tensed by Issue-తుమ్మలతో భేటీ

టీడీపీ కి టెన్షన్ తగ్గేలా లేదు. తెలంగాణలో రెండే రెండు స్థానాలు గెలిచినా టీడీపీ కి ఆ నేతలు ఉంటారా లేకా గులాబీ పార్టీ కి జై కొడతారా అర్ధం కాకుండా వుంది. ఇక ఆపరేషన్ ఆకర్ష్ లో టీడీపీ కి శాసన సభలో ఎమ్మెల్యేలు లేకుండా చెయ్యాలని భావించిన కేసీఆర్ ప్లాన్ అసలు వర్కవుట్ అవుతుందా ? అలా జరిగితే టీడీపీ తెలంగాణ అసెంబ్లీ లో కనుమరుగయ్యే పరిస్థితి. ఇక మళ్ళీ ఈ చర్చ ఎందుకు అంటే ఖమ్మం కేంద్రంగా సాగుతున్న రాజకీయాలు పదేపదే అదే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.
టీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వర్ రావు చంద్రబాబు కు షాక్ ఇవ్వబోతున్నారా ? టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు ఆ టీడీపీ ఎమ్మెల్యే ఆకర్షితులయ్యారా..? మంత్రి పదవి ఇచ్చినా సరే టీఆర్ఎస్ లో చేరేది లేదు అన్న మచ్చా తుమ్మలతో ఎందుకు భేటీ అయ్యారు ? నిన్న మెున్నటి వరకు నేను టీఆర్ఎస్ లో చేరనుంటూ బెట్టు చేసిన ఆయన భవిష్యత్ కోసం తన రూట్ మార్చుకున్నారా..? ఇవి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్న ప్రశ్నలు. సైలెంట్ గా కేసీఆర్ అనుకున్న వ్యూహాలు అమలు చేస్తుంటే మచ్చా వంటి నాయకులు ఎక్కడో ఒకచోట బోల్తా పడతారు అనేది తాజా పరిణామాలను బట్టి అర్ధం అవుతుంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్యలు గెలుపొందారు. తెలంగాణలో టీడీపీని ఖాళీ చెయ్యాలని కంకణం కట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ వారిని గులాబీ పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించింది. అయితే ఈ ఎమ్మెల్యేలు ఇద్దరూ టీఆర్ఎస్ పార్టీలో చేరిపోతారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మెచ్చా నాగేశ్వరరావు తుమ్మలను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇకపోతే తెలంగాణలో టీడీపీ అనేది ఉండకూడదని భావించిన టీఆర్ఎస్ అధినేత గత ఎన్నికల నుండీ తాజాగా జరిగిన ముందస్తు ఎన్నికల తర్వాత కూడా టార్గెట్ టీడీపీ అంటున్నారు.కేసీఆర్ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య,మెచ్చా నాగేశ్వరరావులను పార్టీలోకి రావాలంటూ ఆహ్వానాలు అందించారు. అయితే ఇరువురు నేతలు స్పందించకపోవడంతో గులాబీ బాస్ కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగారు. సండ్ర వెంకట వీరయ్యకు నేరుగా ఫోన్ చేసినట్లు ప్రచారం జరిగింది. మంత్రి పదవి ఇస్తా పార్టీలోకి రావాలంటూ కోరినట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై సండ్ర వెంకట వీరయ్య మాత్రం స్పందించలేదు. కానీ అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాత్రం ఈ వార్తలను ఖండించారు. తాను టీడీపీలోనే ఉంటానని సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు.మంత్రి పదవి ఇచ్చినా టీడీపీ ని వదిలిపోనని ప్రకటన చేశారు. ఇక ఆ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎటువంటి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో ఆ ఇద్దరినీ పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యత తుమ్మల నాగేశ్వరరావుతోపాటు పలువురికి అప్పగించారు. వారు ఆపనిలో నిమగ్నమై ఉన్నారు.
ఈ నేపథ్యంలో తమ్మల నాగేశ్వరరావుతో మెచ్చా నాగేశ్వరరావు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత చోటు చేసుకుంది. అయితే మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని అందులో భాగంగానే తుమ్మలను కలిశారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే మెచ్చా మాత్రం తుమ్మల నాగేశ్వరరావు అనారోగ్యంతో ఉన్నారని వారిని పరామర్శించేందుకే వచ్చానే తప్ప ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పటం గమనార్హం . ఏది ఏమైనా రోజుకో రకంగా టీడీపీ ఇద్దరు ఎమ్మెల్యేలు అధినేత చంద్రబాబును టెన్షన్ పడుతున్నారనేది మాత్రం వాస్తవం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *