మమతా బెనర్జీ కోసం ప్రచారం చేసిన బాబు

Chandrababu done campaigning for mamata banerjee.. బెంగాల్ టైగర్ అని కితాబు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. కోల్ కతాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, బెంగాల్ అభివృద్ధి కోసం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరోమారు పట్టం కట్టాలని కోరారు. మమతా బెనర్జీ నేతృత్వంలోనే బెంగాల్ అభివృద్ధి జరుగుతుందన్న చంద్రబాబు, ఆమెను ‘బెంగాల్ టైగర్’గా అభివర్ణించారు.
ఈ సందర్భంగా ఓటర్లకు చంద్రబాబు కొన్ని సూచనలు చేశారు. ఓటు వేసిన తర్వాత తమ ఓటు ఏ పార్టీకి వేశామో ఆ పార్టీకే పడిందో లేదో అన్న విషయం వీవీప్యాట్ స్లిప్సులను సరిచూసుకోవడం ద్వారా తెలుసుకోవాలని చెప్పారు. ఓటింగ్ సమయంలో ఎవరైనా తప్పు చేస్తే నిలదీయాలని సూచించారు. ఈ నెల 23న బీజేపీ ఓటమి చవిచూడబోతోందని వ్యాఖ్యానించారు. ఈ నెల 23 తర్వాత కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం రావడం తథ్యమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *