చంద్రబాబుకే గురిపెట్టిన నానీ

Spread the love

Chandrababu Compromise ?

టీడీపీలో ముసలం పుట్టింది . ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ దుమ్మెత్తిపోసుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా పార్టీలోని కొంత మంది నేతలపై తీవ్రమైన విమర్శలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మరోసారి ట్వీట్ ద్వారా సంచలనం సృష్టిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు, కేశినేని నానికి మధ్య గత కొద్ది రోజులుగా ట్విట్టర్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే.
తాజాగా, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ కేశినేని నాని ట్వీట్ చేశారు. తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు గారూ… నా లాంటివాళ్లు పార్టీలో ఉండకూడదని మీరు అనుకుంటే.. పార్లమెంటు సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి ఎలా రాజీనామా చేయాలో చెప్పండి అంటూ ఆయన ట్వీట్ చేశారు. తన లాంటివాళ్లు పార్టీలో కొనసాగాలనుకుంటే మీ పెంపుడు కుక్కలను నియంత్రంచండని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు.
చాలా కాలంగా కేశినేని నిరసన గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే.. ఇక ట్విట్టర్ వేదికగా ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకొంటున్న కేశినేని నాని, బుద్దా వెంకన్నలకు టీడీపీ నాయకత్వం నుండి ఫోన్లు వచ్చాయి. ఈ ఇద్దరు నేతలు చంద్రబాబుతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. టీడీపీ ఎంపీ కేశినేని నాని అదే పార్టీకి చెందిన బుద్దా వెంకన్నపై తీవ్ర విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా నాని చేసిన విమర్శలపై బుద్దా వెంకన్న కౌంటరిచ్చారు. ఆదివారం నాడు బుద్దా వెంకన్న, కేశినేని నాని మధ్య ట్వీట్ల యుద్దం సాగింది.ట్వీట్ల యుద్దం సోమవారం నాడు కూడసాగింది. ఈ పరిణామం పార్టీకి తీవ్ర నష్టాన్ని కల్గించేదిగా ఉందని భావించిన చంద్రబాబు ఇద్దరు నేతల మధ్య రాజీ చేసే ప్రయత్నాలను ప్రారంభించారు. ఇద్దరికి టీడీపీ అధినాయకత్వం సోమవారం నాడు ఫోన్ చేసింది. ఇద్దరు నేతలు తమ వాదనలను విన్పించారు. సంయమనం పాటించాల్సిందిగా ఇద్దరికి పార్టీ అధినాయకత్వం సూచించింది. ఇద్దరు నేతలతో చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు.

Political news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *