చంద్రబాబు అనుకున్నదొకటి.. అయ్యిందొకటి

Chandrababu expected .. something

ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయాక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా నిరాశతో కృంగిపోయాడన్న మాట వాస్తవం. కాగా అంతటి నిరాశ నుండి కోలుకున్నాక చంద్రబాబు నాయుడు కొత్తగా ఏపీలో అధికారాన్ని దక్కించుకున్న వైసీపీ పార్టీ పైన తీవ్రమైన విమర్శలు చేస్తూ ప్రభుత్వ పనితీరును  తప్పుబడుతున్నారు చంద్రబాబు. కాగా చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం జరిగిన సంగతి  మనకు తెలిసిందే. ఈ సమావేశంలో వైసీపీ ప్రభుత్వం పైన యుద్ధం చెయ్యాలని  చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అందుకు తాను చెప్పిన దేనికైనా పార్టీ ముఖ్యులు ఓకే అంటారని అనుకున్నారు.
కానీ ఏమైందో తెలీదు చంద్రబాబు వేసుకున్న ప్లాన్  రివర్స్ అయింది. చంద్రబాబు ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం తమ నేతలందరూ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ నేతలందరినీ  టీడీపీ నేతలు టార్గెట్ చేస్తారని భావిస్తే , అది రివర్స్ అయి సొంత పార్టీలోనే తీవ్రంగా విమర్శలకు తెరలేచింది .అంతేకాకుండా ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ తప్పు ఉన్నందు వల్లే తాము ఓడిపోయామని టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఇకనైనా తప్పు సరి చేసుకొని ప్రజలందరి మెప్పు పొందాలని తెలిపారు. అయితే ప్రస్తుతానికి నిరసనలు,  ఆరోపణలు చేస్తే ఎవరు కూడా పట్టించుకోరని, దానికితోడు కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా విమర్శలు చేసిన కూడా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు వాఖ్యానించారు. దీంతో ఖంగు  తినటం చంద్రబాబు వంతయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *