చంద్రబాబు సవాల్ .. నిరూపిస్తావా .. రాజీనామా చేస్తా?

Chandrababu Naidu Challenge To CM Jagan Over Heritage
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా అసెంబ్లీ వేదికగా హెరిటేజ్ ఫ్రెష్  పై రచ్చ కొనసాగింది. హెరిటేజ్ ఫ్రెష్ విషయం మరోసారి ఇవాళ అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది. ఉల్లి  ధరలపై   జరిగిన చర్చ సందర్భంగా హెరిటేజ్‌లో కిలో ఉల్లి రూ.200కు అమ్మడం లేదా? అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించడంపై ఘాటుగా స్పందించారు చంద్రబాబు నాయుడు. హెరిటేజ్  తనది కాదన్న విషయాన్ని సోమవారం రోజే ఖండించా అని చెప్పిన చంద్రబాబు  మరోమారు హెరిటేజ్ మాది కాదు అని చెప్పా, మళ్లీ మీరు హెరిటేజ్ విషయం సభలో ఎందుకు తెచ్చారని  ఫైర్ అయ్యారు. దీంతో  సవాళ్లు , ప్రతి సవాళ్ళతో సభ దద్దరిల్లింది.

ఉల్లిపై చర్చ సందర్భంగా గుడివాడ రైతు బజార్ దగ్గర ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందడంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. గుడివాడ మార్కెట్‌కు ఉల్లి కోసం వెళ్లి ఓ వ్యక్తి చనిపోవడం వాస్తవం కాదా..? పేదవాళ్ల జీవితాలతో ఆడుకోవద్దు అంటూ చంద్రబాబు సీఎం జగన్ మోహన్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. అయితే, దీనిపై స్పందించిన మంత్రి కొడాలి నాని.. చంద్రబాబు శవ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అదే సమయంలో గుండెపోటుతో మృతిచెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు మీడియాతో ఏం మాట్లాడారో అసెంబ్లీలో వీడియో క్లిప్స్ కూడా ప్రదర్శించారు.

ఇక ఇదే ఉల్లి లొల్లిపై మాట్లాడిన సీఎం జగన్ మోహన్ రెడ్డి  ఉల్లి ధరలపై రాజకీయం చేస్తుంటే చాలా బాధేస్తోందన్నారు. మన రాష్ట్రంలో సబ్సిడీపై ఉల్లి ఇస్తున్నందుకు గర్విస్తున్నామని ఆయన పేర్కొన్నారు.  ఏ రాష్ట్రంలోనూ సబ్సిడీపై ఉల్లి ఇవ్వడంలేదన్న విషయాన్ని ఆయన మరోమారు స్పష్టం చేశారు. . రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో  ఉల్లి సబ్సిడీపై ఇస్తున్నామని, హెరిటేజ్ షాపుల్లో రూ.200కు కిలో ఉల్లి అమ్మడం లేదా? అంటూ మరోసారి వ్యాఖ్యానించారు.

చౌకగా ఉల్లిని ఇస్తున్నందునే రైతు బజార్ల దగ్గర క్యూ లైన్లు ఉంటున్నాయని పేర్కొన్న సీఎం జగన్ చంద్రబాబుకు శవరాజకీయం కొత్తకాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, శుక్రవారం నుంచి మార్కెట్‌ యార్డుల్లో కూడా ఉల్లిని సబ్సిడీపై అందిస్తామని తెలిపారు. సీఎం వ్యాఖ్యలతో ఫైర్ అయిన చంద్రబాబు హెరిటేజ్ మాదేనని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నారు.  చంద్రబాబు లేకుంటే సీఎం పదవికి జగన్ రాజీనామా చేస్తారా? అంటూ  జగన్ కు సవాల్ చేశారు.

ఇక చంద్రబాబు చేసిన సవాలుకు   కౌంటర్ ఇచ్చిన మంత్రి  కొడాలి నాని చంద్రబాబు టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని  ఫైర్ అయ్యారు.  ఆయన సవాల్‌కు సీఎం జగన్  స్పందించాల్సిన అవసరం లేదని  పేర్కొన్న కొడాలి నాని  నోరు ఉందికదా అని ఏది పడితే అది సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాట్లాడితే సరికాదని చంద్రబాబు కి కౌంటర్ ఇచ్చారు.  ఇక అంతే కాదు చంద్రబాబుకు  ప్రతి సవాల్ చేసిన  కొడాలి నాని గన్నవరంలో నిన్న చనిపోయిన వ్యక్తి ఫొటోలను పెట్టి ఆందోళన చేశారు.ఆయన ఉల్లి కోసం వెళ్లలేదని కుటుంబసభ్యులను పిలిపించి  సభలో చెప్పిస్తా ..  ఇక మీరు వాళ్లకు క్షమాపణ చెప్పి, రాజీనామా చేసి  ఇంటికి పోతారా? అంటూ  చంద్రబాబును ప్రశ్నించారు.  అసెంబ్లీ వేదికగా  చంద్రబాబు చేసిన సవాలుకు  రివర్స్ కౌంటర్ ఇచ్చారు కొడాలి నాని.

Chandrababu Naidu Challenge To CM Jagan Over Heritage, Chandrababu,CM #YSJagan,Heritage,AP Assembly LIVE,CM Jagan Counter To Chandrababu Naidu,#KodaliNani,AP Onions Price

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *