ఢిల్లీలో వీధి నాటకాలు ఆడుతున్న బాబు

Chandrababu Playing Games on Delhi streets ..కేటీఆర్ ఫైర్

ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అని కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా – ఎన్నికల సంస్కరణల కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ అధినేతకు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సలహాలు ఇచ్చారు. ప్రజాతీర్పును స్వాగతించాలే కానీ ఇలా గగ్గోలు పెట్టొద్దని.. మీ వాదనల్లో విశ్వసనీయత ఉంటేనే ప్రజలు ఆదరిస్తారంటూ చెప్పుకొచ్చారు . అంతేకాదు.. ఈవీఎంలపై ఇన్ని ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు పొరపాటున రేపు ఫలితాలు వచ్చినప్పుడు గెలిస్తే అప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు .

ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు కేటీఆర్. 2014లో ఈవీఎంలపై రాని అనుమానాలు ఇప్పుడు ఎందుకొస్తున్నాయని ప్రశ్నించారు. గెలిస్తే ఈవీఎంల పనితీరు అద్భుతమా.. లేకపోతే తప్పా అంటూ ప్రశ్నించారు. ప్రజలపై నమ్మకం లేకనే ఢిల్లీలో వీధినాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.చిల్లర రాజకీయాలు ఇకనైనా మానుకోవాలన్నారు. ఎన్నికల సంఘం అధికారుల్ని బదిలీ చేస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్నికలు జరిగిన తీరు టీఆర్ ఎస్ పాలనకు అద్దం పడుతోందని.. ఏపీలో ఎన్నికలు జరిగిన తీరు వాళ్ల పాలనకు అద్దం పడుతోందని అభిప్రాయపడ్డారు.

ప్రచారంలో వంగి వంగి దండాలు పెట్టినప్పుడే చంద్రబాబు పనైపోయిందని అర్ధమైందన్నారు కేటీఆర్. 40ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న వ్యక్తి.. ఇంత చిల్లర అరుపులు ఎందుకు అరుస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం.. ట్యాంపరింగ్ జరిగితే ప్రజలు తిరగబడతారని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *