ఏపీలో ఇసుక పోరు.. 14 న  చంద్రబాబు దీక్ష

Chandrababu preparing for initiation on november 14

జగన్ ప్రభుత్వ అసమర్ధ  పాలనతో  నిర్మాణ రంగ కార్మికులు ఇబ్బంది పడుతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇసుక కొరత ఏర్పడటం తో పనుల్లేక కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక ఇసుక కోసం సాగించే పోరాతమో భాగంగా టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు దీక్షకు సిద్ధమయ్యారు. విజయవాడలో ఈ నెల 14 న దీక్ష జరపాలని నిర్ణయించారు.ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దీక్ష జరగనుంది. వేదిక ఇంకా నిర్ణయించలేదు. టీడీపీ నేతలు, కార్యకర్తలు దీనికి సన్నాహాలు చేస్తున్నారు. ఇసుక కొరత వలన కార్మికులు ఎంతగా ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం మాత్రం వరదలు అని కారణం చెబుతుంది. జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించి రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి తన నిరసనని తెలియజేసాడు. నారా లోకేష్ కూడా గుంటూరు లో నిరసనకు దిగిన సంగతి తెలిసందే. వైసీపీ ప్రభుత్వం వ్యక్తిగత విమర్శలు చేస్తుంది అంటూ జనసైనికులు ఆరోపిస్తున్నారు. మరి ఈ విషయం ఇలానే ముదిరితే జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
tags : sand shortage, ap, cm jagan, chandrababu, protest, ycp government

రాజధాని పులివెందులలో ,హైకోర్టు కర్నూలులో పెట్టండని పవన్ వ్యంగ్యాస్త్రాలు 

విజయవాడ వద్ద గోవుల మృతిపై సిట్ నివేదిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *