వైసీపీది రాజకీయ ఉగ్రవాదం అన్న చంద్రబాబు

Chandrababu sai YCP IS POLITICAL TERRORISTS

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్రబాబు స్వ‌రం పెంచారు. ప్ర‌భుత్వం మీద తీవ్ర విమర్శ‌లు చేసారు. పార్టీ ఎమ్మెల్యేల‌తో స‌మావే శ‌మైన చంద్ర‌బాబు అసెంబ్లీలో అనుస‌రించాల్సిన వ్యూహాల పైన చ‌ర్చించారు. అదే స‌మ‌యంలో రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్పాటైన 40 రోజుల్లోనే రాజ‌కీయ ఉగ్ర‌వాదం తారాస్థాయికి చేరింద‌ని ఆరోపించారు. దాడులు..మ‌హిళ‌ల‌పై వేధింపులు..వైసీపీ అరాచ‌కాల‌కు అడ్డు లేకుండా పోయింద‌న్నారు. అభివృద్దిపైన దృష్టి పెట్ట‌కుండా ఏపీని తిరోగ‌మ నంలోకి తీసుకెళ్తున్నార‌ని..తాము విమానాలు తెస్తే..జ‌గ‌న్ విమానాల‌ను ర‌ద్దు చేయిస్తున్నార‌ని ఫైర్ అయ్యారు. స‌భ‌లోనే ప్ర‌భుత్వ అరాచ‌కాల‌ను నిల‌దీసీ..ప్ర‌జ‌ల వాయిస్ వినిపించాల‌ని ఎమ్మెల్యేల‌కు చంద్ర‌బాబు నిర్ధేశం చేసారు.
టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇక వైసీపీతో రాజ‌కీయంగా తేల్చుకొనేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా వైసీపీ ప్ర‌భుత్వం పైన తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. జగన్‌ మాటలకూ చేతలకూ పొంతన లేదు. పాలనపై, ఇచ్చిన హామీల పై దృష్టి పెట్టాల్సిన వైకాపా కేవలం తెదేపా నేతలే లక్ష్యంగా కాలం వెళ్లదీస్తోంద‌ని విమ‌ర్శించారు. అసెంబ్లీ స‌మావేశా ల్లో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను టీడీపీ పైకి తోసేసి త‌ప్పించుకోవాల‌ని వైసీపీ చూస్తోంద‌ని పేర్కొన్నారు.నీటి విడుదలలో నిర్లక్ష్యం, ఏపీ విత్తనాలను తీసుకెళ్లి తెలంగాణలో ఇవ్వడం వంటివి వైకాపా వైఫల్యాలకు పరాకాష్ఠని..వీటి పైన అసెంబ్లీ లో ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని సూచించారు. రాజశేఖర్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వంపై బురద జల్లారు. ఆయన అధికారంలోకి వచ్చాక ప్రజా ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని తెదేపా ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించారు. కానీ జగన్‌ మాత్రం తెదేపా ప్రభుత్వం మొదలు పెట్టిన అభివృద్ధి పనులన్నీ నిలిపి వేసి రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపిస్తున్నార‌ని ఫైర్ అయ్యారు.
జ‌గ‌న్ చెబుతున్న‌దానికి..చేస్తున్న దానికి పొంత‌న లేద‌న్నారు. అమ్మఒడి పథకానికి షరతులు పెట్టడం.. పింఛను సొమ్ము రూ.250 మాత్రం పెంచి రూ.1250 పెంచామని ప్రచారం చేసుకోవడం, డ్వాక్రా రుణాల్ని దశలవారీగా మాఫీ చేస్తాననడం వంటి అరాచక చర్యలకు పాల్పడుతోందని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో జగన్‌ తిరోగమన పాలనకు తెరతీశారు. పోలవరానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టడం చేతకాదు. నాలుగు నెలలుగా ఆగిపోయిన పనులు మళ్లీ మొదలు పెట్టే సామర్థ్యం లేదు. కాంట్రాక్టు రద్దు, రివర్స్‌ టెండరింగ్‌ అంటూ రకరకాల విన్యాసాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. తెదేపా ప్రభుత్వ హయాంలో విజయవాడ నుంచి వివిధ విమాన సర్వీసులు నడిపితే, జగన్‌ వాటన్నింటినీ రద్దు చేశారని ఆరోపించారు. శాస‌న‌స‌భా స‌మావేశాల‌కు త‌ప్ప‌ని స‌రిగా ఎమ్మెల్యేలంతా హాజ‌రు కావాల‌ని.. ప్ర‌భుత్వం విమ‌ర్శ‌లు చేస్తే తిప్పి కొట్టాల‌ని ఎమ్మెల్యేకు చంద్ర‌బాబు సూచించారు.

LATEST POLITICAL NEWS

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *