టీడీపీ అభ్యర్థి నానీపై కేసు నమోదు

Spread the love
Chandragiri re-polling

చంద్రగిరిలో రీ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 7 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ప్రశాంతంగా ప్రారంభమైనా..మధ్యాహ్న సమయంలో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై పోలీసులు FIR నమోదు చేయడం కలకలం రేపుతోంది. మరో కేంద్రంలో వృద్దురాలి ఓటు ఓ ఏజెంట్ వేసినందుకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కమ్మపల్లి, వెంకటరామపురం, పులివర్తివారి పల్లి, కొత్త కండ్రిగ, ఎన్ఆర్ కమ్మపల్లి, కుప్పం బాదూరు, కాలేపల్లిలో పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 12గంటల వరకు 7 పోలింగ్ కేంద్రాల్లో 42.23 శాతం నమోదైంది. కమ్మపల్లి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు ప్రజలు బారులు తీరారు. మునిచంద్ర నాయుడు అనే వ్యక్తి వృద్ధురాలి తరపున ఓటు వేసేందుకు వెళ్లాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని రామచంద్రాపురం పీఎస్‌కు తరలించారు. వృద్ధురాలికి కళ్లు కనిపించకపోవడంతో తాను సహాయకుడిగా వెళ్లడం జరిగిందని..డీఎస్పీ పర్మిషన్ తీసుకున్నట్లు మునిచంద్ర వెల్లడించాడు.
పులివర్తి వారి పల్లిలో రీ పోలింగ్ కొనసాగుతోంది. ఇక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనరల్ ఏజెంట్..టీడీపీ అభ్యర్థి నానికి మధ్య గొడవ జరిగింది. పరస్పర దాడికి దిగారు. తనపై దాడికి దిగాడని జనరల్ ఏజెంట్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. దీనితో నానిపై పోలీసులు FIR నమోదు చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *