CHENNAI WON FIRST MATCH
2020లో ఐపీఎల్ టోర్నీలో చెన్నై బోణి చేసింది. ప్రత్యర్థి ముంబై జట్టుని ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లను కోల్పోయి 162 పరుగులు చేసింది. బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనెర్లను త్వరగా కోల్పోయింది. కాకపోతే, ఆ తర్వాత రాయుడు, డూప్లెసిస్ లు కలిసి చెన్నై జట్టును విజయతీరాలకు చేర్చారు. రాయుడు జోరుగా ఆడి తన సత్తా ఏమిటో చూపెట్టాడు. డూప్లెసిస్ చివరి వరకూ నిలిచి చెన్నైను గెలిపించారు. ఐదు వికెట్లను కోల్పోయి 19.2 ఓవర్లలో 166 పరుగుల్ని చేసి ఐదు వికెట్ల తేడాతో చెన్నై గెలిచింది. 2013 తర్వాత తొలిసారి ముంబై ఇండియన్్స జట్టుపై చెన్నై గెలిచింది. ఎంఎస్ ధోని కెప్టెన్ గా చెన్నైకి ఇది వందో గెలుపు.