పోలీసులు అన్యాయం చేశారని చెన్నకేశవులు భార్య ధర్నా

Chennakesavulu Wife Protest

డాక్టర్ దిశ హత్యా ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది . ఇక దిశ కేసులోని నిందితులను నిన్న తెల్లవారుజామున చటాన్‌పల్లి బ్రిడ్జ్ వద్ద పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీనితో దిశకు తగిన న్యాయం జరిగిందని దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై నిందితుల కుటుంబీకులు మాత్రం తీవ్ర అభ్యంతరం తెలిపారు. అన్యాయంగా తమ వాళ్ళను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య  తన భర్తను చంపిన చోటే.. తనను కూడా కాల్చమని ప్రాధేయపడింది.

అంతేకాకుండా ఇవాళ ఆమె ఈ ఎన్‌కౌంటర్‌పై రోడ్డెక్కి ధర్నా చేసింది. దేశంలో చాలా మంది అత్యాచారం చేసిన వాళ్ళు ఉన్నారని.. వాళ్ళని ఇప్పటివరకు ఎన్‌కౌంటర్‌ చేయలేదని.. కేవలం తన భర్తను మాత్రం ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని ప్రశ్నించింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని చెప్పింది. తన భర్త శవాన్ని తనకే అప్పగించాలని, ఇష్టమొచ్చినకాడ పూడ్చిపెట్టడానికి  అసలు పోలీసులు ఎవరూ అంటూ ఆమె నిలదీసింది . చంపడం, పూడ్చడం కూడా మీ ఇష్టమేనా , మీ బాధ్యతనేనా ఆమె పోలీసుల తీరును ప్రశ్నించింది. నిండు గర్భిణి అని కూడా చూడకుండా తన భర్తను చంపారని, మీకు మానవత్వం ఉందా అని  పోలీసులపై తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించింది.
తనకు అన్యాయం జరిగింది అని ఆమె పేర్కొంది.  తన భర్తను చంపినట్టే తనను కూడా చంపాలని ఆవేదన వ్యక్తం చేసింది.అమ్మాయిపై అత్యాచారం చేసినందుకు నా మొగుడితో సహా నలుగురిని చంపారని.. ఇలాంటి కేసుల్లో నిందితులుగా  జైళ్లలో ఉన్న వారిని అందరినీ కూడా చంపేయాలని చెన్నకేశవులు భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది.దిశ కేసు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య పోలీసుల తీరుపై  ధర్నా చేసింది. గ్రామంలో ధర్నా చేస్తున్న చెన్నకేశవులు భార్యను పోలీసులు  జోక్యం చేసుకునినచ్చజెప్పి పంపించారు.

Chennakesavulu Wife Protest ,disha murder, disha case, encounter, accused encounter , supreem court , petition , chennakeshavulu, wife , protest 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *