మెగా బ్లడ్ బ్రదర్ కుటుంబానికి చెర్రీ 10 లక్షల విరాళం

Spread the love

Cheryl 10 lakh donation to Mega Blood Brother family

మెగా బ్లడ్ అభిమాని నూర్ భాయ్ మరణంపై మెగా కుటుంబం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది. నూర్ భాయ్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. నూర్ భాయ్ అంటే హైదరాబాద్ నగర మెగా అభిమాన సంఘ ప్రెసిడెంట్. మెగా కుటుంబానికి దగ్గర వ్యక్తి. మెగా కుటుంబలో ఏ హీరో పుట్టిన రోజైనా కానివ్వండి నూర్ భాయ్ నగరంలో పలుచోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించేవారు. మెగా సినిమాలు విజయం సాధిస్తే ఆ హడావుడి ఇతను చేసేవాడు. అలాంటి వ్యక్తి గుండెపోటుతో మరణించడంతో మెగా కుటుంబానికి తీరనిలోటనే చెప్పాలి. ఇక ఆయన మరణాంతరం చిరంజీవి, అల్లు అర్జున్, అల్లు అరవింద్, తేజ్ తదితరులు తన కుటుంబాన్ని పరామర్శించారు. ఇక తాజాగా  రామ్ చరణ్ నూర్ భాయ్ ఇంటికెళ్లి భాయ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ మేరకు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ నూర్ భాయ్ ని గుర్తు చేసుకుంటూ ఆవేదనకు గురయ్యాడు. ఇక అయన కుటుంబ సభ్యులతో మాట్లాడి 10 లక్షల రూపాయలు అందిస్తున్నట్టుగా ప్రకటించారు. మెగా బ్లడ్‌ బ్రదర్‌ నూర్‌ అహ్మద్‌ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాడు.

TOLLYWOOD NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *