మరో వివాదంలో చేవెళ్ళ మాజీ ఎంపీ కొండా

Chevella MP Konda in New Issue

.. ఎస్సై నిర్బంధం కేసు నమోదు

కాంగ్రెస్ పార్టీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి ఇబ్బందుల్లో పడ్డారు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుచరుడు సందీప్ రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన తమను కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో బంధించారని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.

చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై మరో పోలీస్ కేసు నమోదైంది. నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన ఎస్ఐని గదిలో నిర్బంధించి చిత్ర హింసలు పెట్టారనే ఆరోపణలపై ఆయనపై బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో గచ్చిబౌలిలో నగదు పట్టివేత కేసులో నోటీసులు ఇచ్చేందుకు సందీప్ రెడ్డి ఇంటికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెళ్లారు. ఆ సమయంలో తమను బంధించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆయన అనుచరులు చిత్రహింసలు పెట్టారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 332, 342, 506 కింద కేసు పెట్టారు.

సందీప్ రెడ్డి.. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఎన్నికల సమయంలో డబ్బుతో పట్టుబడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మంగళవారం(ఏప్రిల్ 16, 2019) నోటీసులు ఇచ్చేందుకు బంజారాహిల్స్ ఎస్ఐ.. సందీప్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయనను చిత్రహింసలు పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. యూనిఫామ్ లో ఉన్న అధికారిని బెదిరించే ప్రయత్నం చేశారని కొండాపై కేసు నమోదు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి.. ఒక ప్రభుత్వ అధికారితో ఇలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *