బాగా తగ్గినా చికెన్ ధరలు … రీజన్ ఇదే 

Spread the love

chicken price decreased

చికెన్ ధరలు బాగా తగ్గాయి. చికెన్ ప్రియులకు ఇది నిజంగా శుభవార్త. మొన్నటి వరకు ఆకాశాన్నంటిన చికెన్ ధర… ఇప్పుడు దిగి వచ్చింది.  వేసవిలో కిలో చికెన్ ధర రూ.280 పలకగా… ఇప్పుడు రూ.176కి పడిపోయింది. దేశంలోనేఅత్యధికంగా చికెన్‌ వినియోగించే రాష్ట్రంగా తెలంగాణ పేరు పొందింది. ప్రత్యేకించి రాష్ట్రంలో వినియోగించే మొత్తంలో సగం ఒక్క హైదరాబాద్‌నగరంలోనే వినియోగం అవుతుందని పౌల్ట్రీ వ్యాపారులు తెలిపారు.
వేసవిలో ఎండలకు కోళ్లు ఎక్కువగా చనిపోయాయని… అందుకే ధర ఎక్కువగా పలికాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు కోళ్ల లభ్యతగా ఎక్కువగా ఉండటంతో.. ధరల్లో తేడా వచ్చింది. ధర తగ్గడం మాత్రమే కాదు.. చికెన్ వినియోగం కూడా బాగా తగ్గిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు.   ఆషాఢంలో జాతరలు, బోనాల వంటి ఉత్సవాలు ఉన్నా ఎక్కువగా మేకలు, గొర్రె మాంసానికే అధికశాతం మంది ప్రాధాన్యత ఇవ్వడంతో చికెన్‌ ధరలు 220 నుంచి 200 రూపాయల వద్ద కొనసాగుతూ వచ్చింది.తర్వాత శ్రావణ మాసం ప్రారంభం కావడంతో మాంసాహార ప్రియులు చాలా మంది నాన్‌వెజ్‌కుదూరంగా ఉన్నారు. దీంతో ప్రస్తుతం హోల్‌సేల్‌మార్కెట్‌లో చికెన్‌ధర కిలోకు 120 నుంచి 150 రూపాయలు పలుకుతోంది. అలాగేరిటైల్‌ వ్యాపారులు కిలోకు 176 రూపాయలకు విక్రయిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *