Chiken rates Incres
ఇప్పటికే నిత్యవసర సరుకుల రేట్లు బాగా పెరిగాయి. కూరగాయలు ధరలు రేట్లు భగ్గుమంటున్నాయి. సామాన్యుల పరిస్థితి ఏం కొనెట్టే ఏం తినేట్టు లేదు. పెరుగుతున్న కూరగాయల ధరలతో ఆందోళన పడుతున్న ప్రజలు కనీసం ఆదివారమైనా చికెన్ తినలేని పరిస్థితులు ఉన్నాయి. కోడి మాంసం కొండెక్కింది. కరోనా భయంతో మార్చి, ఏప్రిల్ మాసాల్లో వినియోగం తగ్గడంతో అప్పట్లో ధరలు భారీగా పతనమయ్యాయి. లాక్డౌన్ ఆంక్షలు తొలగడంతో ఇప్పుడు జనం చికెన్ తినేందుకు ఎగబడుతున్నారు. చికెన్‌తో కరోనా రాదని, పైగా రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెప్పడంతో గ్రేటర్ ప్రజలు చికెన్ తీనేందుకు ఇష్టం చూపుతున్నారు. డిమాండ్‌కు తగిన కోళ్ల ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరిగాయి.
గ్రేటర్ శివారుతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కోళ్లకు డిమాండ్ పెరిగిందని, అందుకే ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. రెండు వారాల క్రితం కిలో 170 రూపాయలు ఉన్న చికెన్ ధర..ఇపుడు 220–230 రూపాయలకు చేరుకుందని అంటున్నారు. ఇంకొన్ని రోజుల్లో 250 దాటినా ఆశ్యర్యపోనక్కర్లేదని పలువురు చికెన్ వ్యాపారులు చెప్తున్నారు.