ఈ చిన్నారి సంపాదన తెలిస్తే కళ్లు తేలేస్తారు

Spread the love

CHILD EARN 21 LAKHS

ఆరేళ్ల పిల్లలు ఏం చేస్తారంటే.. అల్లరి చేస్తారు, బొమ్మలిస్తే ఆడుకుంటారు అని చెబుతాం. కానీ దక్షిణ కొరియాకు ఈ చిన్నారి మాత్రం ఆ బొమ్మలపై రివ్యూ చెబుతుంది. తద్వారా లక్షలకు లక్షలు సంపాదిస్తోంది. ఆమె నెల సంపాదన ఎంతో తెలిస్తే కళ్లు తేలేయడం ఖాయం. యూట్యూబ్ లో ఇలా రివ్యూలు ఇవ్వడం ద్వారా బోరం అనే ఈ చిన్నారి నెలకు రూ.21 లక్షలు ఆర్జిస్తోంది. ‘బోరం టాయ్ రివ్యూస్’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ చిన్నారి తన వీడియోలు పోస్ట్ చేస్తుంది.

ఈమెకు మొత్తం 3 కోట్లకు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. బోరం టాయ్ రివ్యూస్ ఛానల్ కు 1.36 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉండగా.. మరో వీడియో బ్లాగ్ కు 1.76 కోట్ల మంది ఖాతాదారులున్నారు. ఈమె వీడియో కోసం దక్షిణ కొరియన్లు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. బోరం వీడియోలకు కోట్లలో వ్యూస్ వస్తుంటాయి. ప్లాస్టిక్ టాయ్ కిచెన్ లో బోరం చేసిన ఇన్ స్టంట్ నూడుల్స్ వీడియోను ఏకంగా 37.6 కోట్ల మంది వీక్షించారు. బోరం ఎంతగా పాపులర్ అయ్యిందో.. వివాదాలలోనూ అదే రీతిలో నిలిచింది. ఆమె చేస్తున్న కొన్ని వీడియోలు పిల్లల్ని తప్పుదారి పట్టించేలా ఉందనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయినప్పటికీ ఈమె మరింత పాపులర్ అయ్యింది. ఇటీవలే ఈ చిన్నారి సియోల్ లో ఏకంగా రూ.55 కోట్ల విలువ చేసే భవంతిని కూడా కొనుగోలు చేసింది. దీంతో ఈ వార్త టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. ఎంతైనా బోరం గ్రేట్ కదా!

INTERNATIONAL NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *