వంశీ టార్గెట్ గా చినరాజప్ప ఆసక్తికర వ్యాఖ్యలు

Chinarajappa Interesting Comments On Vamsi

ఏపీ మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా వల్లభనేని వంశీ ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పార్టీకి గుడ్ బై చెప్పిన వల్లభనేని వంశీని జగన్ కూడా పట్టించుకోరని పేర్కొన్నారు. వంశీ మరోసారి ఎమ్మెల్యే కాలేరని, ఆయనకు జగన్ కూడా టికెట్ ఇవ్వబోరని అన్నారు. మళ్లీ పోటీ చేస్తే గెలవలేనన్న కారణంతోనే వంశీ పదవికి రాజీనామా చేయలేదని విమర్శించారు. జగన్ కు దమ్ముంటే వంశీతో రాజీనామా చేయించాలని చినరాజప్ప డిమాండ్ చేశారు. స్వలాభం కోసమే పార్టీ మారుతున్న వంశీ, తన తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసమే ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. హైదరాబాదులో ఉన్న ఆస్తుల కోసమే వంశీ ఏవేవో మాట్లాడుతున్నారని చినరాజప్ప వ్యాఖ్యానించారు.

tags : vamshi, vallabhaneni vamshi, china rajappa, jagan, ap assembly session, chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *