Chine release Five Indians
భారత్ – చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఐదుగురు భారతీయులు వేటకు వెళ్లి పొరపాటుగా వాస్తవాధీన రేఖను దాటారు. మొదట తమకు వారి జాడ గురించి తెలియదన్న చైనా అనంతరం వారు తమ వద్దే ఉన్నట్లు ప్రకటించింది. అనంతరం ఇరు దేశాల మధ్య చర్చలు జరిగి వారిని విడిచిపెట్టడానికి అంగీకరించాయి. చైనా సైన్యం విడుదల చేసిన యువకులను తోచ్ సింగ్కం, ప్రసాత్ రింగ్లింగ్, డోంగ్టు ఎబియా, తనూ బేకర్, న్గారు దిరిగా గుర్తించారు. శుక్రవారం ఉదయం కిభిథు సరిహద్దు పోస్టు గుండా భారత్లోని అరుణాచల్ ప్రదేశ్కు ఆ ఐదుగురిని భారత సిబ్బంది తీసుకొచ్చారు. ‘‘అపహరణకు గురయ్యారని భావిస్తున్న అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఐదుగురు యువకుల జాడ తెలిసిందని, వారిని చైనా అప్పగిస్తానని తెలిపిందని’’ ఇటీవల కేంద్ర సహాయ మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.