మరో కేసులో బుక్ అయిన చింతమనేని

Chintamaneni booked in another case

చింతమనేని ప్రభాకర్  టీడీపీ నేత అందరికీ సుపరిచితం అయిన వ్యక్తి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు అండదండ చూసుకుని దెందులూరులో రెచ్చిపోయారు. ఓ మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసి సమర్థించుకోవడంతో పాటు ప్రభుత్వ అధికారుల విధులను అడ్డుకోవడం గుర్తు వస్తే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చే పేరు చింతమనేని ప్రభాకర్ .
టీడీపీ అధికారంలో ఉన్నప్పడు తాను ఆడింది ఆట.. పాడింది పాట.. తనకు ఎవరు ఎదురు తిరిగినా ఇక అంతే సంగతులు అన్న చందంగా మారింది ప్రభాకర్ వ్యవహారం. టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది.. మాకు ఎదురే లేదు అనుకుని రెచ్చిపోయిన ప్రభాకర్ కు  ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే టీడీపీ ఓడిపోయిందో.. వైసీపీ అధికారంలోకి వచ్చిందో చింతమనేనికి చిక్కులు మొదలయ్యాయి.. ఆయన దెందులూరు ఎమ్మెల్యేగా చేసిన పాపాలను వైసీపీ అధికారంలోకి రాగానే ఒక్కొక్కరు పిటిషన్లు ఇవ్వడం సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని వాటిని కేసులు నమోదు అయ్యేలా చూడటం వరుసగా జరిగాయి.
ఇలా చింతమనేనిపై ఇప్పటికే 66 కేసులు నమోదు అయ్యాయి. అయితే 66వ కేసైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో చింతమనేనికి ఏలూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ మంజూరైనా విడుదలకు ఇవ్వాల్సిన ష్యూరిటీలను కోర్టుకు చింతమనేని సమర్పించడంలో విఫలం అయ్యాడు. దీంతో కోర్టు ఈనెల 28వ వరకు చింతమనేని ప్రభాకర్ కు  రిమాండ్ కు విధించింది కోర్టు.. అయితే చింతమనేని బెయిల్ వచ్చిందో లేదో మరో కేసు నమోదు అయింది. దీంతో మరోమారు ఆయనను పోలీసులు ఆరెస్టు చేశారు.

tags :chintamaneni prabhakar, tdp former mla, denduluru, cases, eluru court, remand

చర్చలకు పిలిచే అవకాశం విలీనం మినహా మిగతా అంశాలపై చర్చ

చర్చలకు పిలిచే అవకాశం విలీనం మినహా మిగతా అంశాలపై చర్చ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *