బొత్సాను సవాల్ చేసిన చింతమనేని

CINTAMANENI CHALLENGES BOTCHS ASTHYANARAYANA

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ సవాల్ విసిరారు. చింతమనేని తప్పు చేయలేదా? అని బొత్స అన్నారని… తాను తప్పు చేసినట్టు బొత్స నిరూపిస్తే తన తండ్రి ఆస్తిని, తన ఆస్తిని పేదలకు దానం చేస్తానని… రుజువు చేయలేకపోతే మంత్రి పదవికి బొత్స రాజీనామా చేస్తారా? అని ఛాలెంజ్ చేశారు. తనపై మెజిస్టీరియల్ విచారణ కూడా అవసరం లేదని… గ్రామ సభ పెట్టి తాను తప్పు చేసినట్టు నిరూపించినా తాను ఏ శిక్షకైనా సిద్ధమేనని అన్నారు. తప్పుడు కేసులు పెట్టి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు తనను అరెస్ట్ చేస్తున్న సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై చింతమనేని సెటైర్లు విసిరారు. విజయసాయిరెడ్డి మమ్మల్ని దొంగలంటున్నారని… ఆయనేమో దొరట అని ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డి మీద ఉన్నన్ని కేసులు మరెవరి మీదా లేవని అన్నారు. తాను బయటకు వస్తున్నట్టు ముందే ప్రకటించానని… కానీ, తనను పట్టుకుంటున్నట్టు పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. 12 పోలీసు బృందాలను పెట్టినా 14 రోజుల పాటు తనను ఎవరూ పట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.

TELANGANA FIRST TRIBAL WOMEN MINISTER

 

Related posts:

ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ఉన్నావ్ రేప్ కేస్...
టిక్ టాక్ లో వీడియో చేసి....
నిందితులకు 14 రోజుల రిమాండ్
ప్రియాంక రెడ్డి హత్య..షాద్‌నగర్ లో ఉద్రిక్తత
బ్రేకింగ్ న్యూస్.. అచ్చెన్నాయుడుకు కారు ప్రమాదం
ప్రియాంకా రెడ్డి హత్య కేసు నిందితులను కోర్టుకు...
తిరుమల కొండపై ప్రైవేట్ హోమం
ప్రియాంకా రెడ్డి హత్యపై జాతీయ మహిళా కమీషన్ సీరియస్
ప్రియాంక కేసులో నిందితులు వీరే...మంత్రి తలసాని పరామర్శ
ఫోటోల కోసం ఫోజులివ్వడానికి వచ్చావా
ఆర్టీసీ కార్మికులను చేర్చుకుంటాం: కేసీఆర్
ప్రియాంక స్కూటీ పంచర్ చేశారా? వారి పనేనా?
ప్రియాంక రెడ్డి హత్య కేసులో 15 బృందాలతో గాలింపు
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి సజీవ దహనం
జార్జ్‌ చనిపోవడానికి ముందు ఎం జరిగిందంటే...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *