67 రోజుల తర్వాత జైలు నుండి బెయిల్ పై విడుదలైన చింతమనేని ప్రభాకర్

Chintamaneni Prabhakar Released On Bail

దెందులూరు నియోజకవర్గ టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎట్టకేలకు జైలు నుండి విడుదలయ్యారు. ఆయనపై పెట్టిన అన్ని కేసుల్లోనూ కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేయడంతో చింతమనేని ప్రభాకర్ కు కాస్త ఊరట లభించింది. 67 రోజులపాటు జైలు జీవితాన్ని గడిపిన చింతమనేని ఏలూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. పలు కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఆయనకు 14 కేసుల్లో బెయిల్ రాగా.. నిన్న నాలుగు కేసుల్లో బెయిల్ మంజూరు అయింది. ఈ ఏడాది ఆగస్టు 29న పెదవేగి మండలం పినకడిమికి చెందిన చెరుకు జోసెఫ్ పై దాడి చేసి కులం పేరుతో దూషించారన్న అభియోగంతో పెదపాడు పోలీస్ స్టేషన్ లో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. మరోవైపు, చింతమనేని విడుదలైన తర్వాత భారీ ర్యాలీ నిర్వహించాలని ఆయన అభిమానులు ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి పోస్టర్లు కూడా వేశారు. అయితే, పోలీసులు చింతమనేని ర్యాలీకి సంబంధించి అనుమతి ఇవ్వలేదు. చింతమనేని రాక కోసం పెట్టిన పోస్టర్లను తొలగించిన పోలీసులు తెలుగు తమ్ముళ్లకు షాక్ ఇచ్చారు. సెప్టెంబర్ 11న చింతమనేని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత పిటి వారెంట్ పై మరో 17 కేసులో అరెస్టు చేశారు. ఇక అప్పటి నుండి చింతమనేని ఏలూరు లోని సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరో రెండు ఇట్టి వారికి పెండింగ్లో ఉన్నాయని జిల్లా పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో బయటకు వచ్చిన చింతమనేని సైలెంట్ గా ఉంటారా లేక వైలెంట్ గా మారుతారా అనేది తెలియాల్సి ఉంది.

tags : tdp, eluru, denduluru, former mla, chintamaneni prabhakar, cases, eluru court bail, eluru sub jail

తెలంగాణ మద్యంతో ఏపీ మందుబాబుల పండుగ

ఢిల్లీ టూర్ లో ఉన్న పవన్ జగన్ గురించి ఏం చెప్పారంటే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *