సీఎం జగన్ తో లంచ్ చేసిన చిరంజీవి దంపతులు

Chiranjeevi couple having lunch with CM jagan

చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ప్రస్తుతం రాష్ట్రంలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఏపీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఉయ్యాల వాడ చరిత్రను అది జరిగిన రాష్ట్రాన్ని ప్రస్తుతం పాలిస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు చూపించాలని మెగాస్టార్ చిరంజీవి నిర్ణయించారు. అంతేకాకుండా సైరా ప్రిరిలీజ్  – ఎక్స్ ట్రా షోలకు జగన్ ఏపీలో అనుమతించిన సంగతి తెలిసిందే..ఇదివరకే చిరంజీవి సీఎం జగన్ ను కలవడానికి ప్రయత్నించగా బిజీ షెడ్యూల్ కారణంగా వీలు  చిక్కలేదు. తాజాగా చిరంజీవి ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి వెళ్ళారు. జగన్ ను కలిసేందుకు చిరంజీవి ఏకంగా ఒక ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ ను బుక్ చేయడం విశేషంగా మారింది. ఆ చిన్న విమానంలో చిరంజీవి హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రాయానికి చేరుకున్నారు..జగన్ తో లంచ్  చేసి కాసేపు భేటి అయ్యి మాట్లాడటానికి  చిరంజీవి ఇస్తున్న ప్రాధాన్యతను దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏకంగా చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసి మరీ జగన్ ను కలవడానికి అమరావతికి చిరంజీవి రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.సీఎంగా జగన్ గద్దెనెక్కాక ఏ సీనియర్ టాలీవుడ్ ప్రముఖులు జగన్ ను కలవలేదనే విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి ప్రత్యేక విమానంలో జగన్ తో లంచ్ కి హాజరు అయ్యారు.

tags : jagan, jagan mohan reddy, ap cm, saira, chiranjeevi, surekh , chartered flight

ఆర్టీసీ కార్మికులతో పాటు రెవెన్యూ ఎంప్లాయిస్ సమ్మె బాట

 హుజూర్ నగర్ లో టఫ్ ఫైట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *