బీజేపీలో చేరనున్న మెగాస్టార్  చిరంజీవి?

CHIRANJEEVI JOINING BJP?
గత కొంత కాలంగా రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేత, ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి ఆ పార్టీని వీడతారని, ఆయనతో బీజేపీ అగ్రనేతలు టచ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి ఉన్నప్పటికీ ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.  బీజేపీ ఆపరేషన్ ‘ఆకర్ష్’ లో భాగంగా కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన లీడర్లపై ఆ పార్టీ అధిష్ఠానం కన్నేసింది. ఇందులో భాగంగా చిరంజీవిని తమ పార్టీలోకి లాక్కోవాలని చూస్తోంది. బీజేపీ నేత రాంమాధవ్ కేంద్రంగా ఈ వ్యవహారం నడుస్తున్నట్టు తెలుస్తోంది. తన 151వ చిత్రం ‘సైరా’ విడుదల తర్వాత చిరంజీవి బీజేపీలో ఆయన చేరే అవకాశాలున్నట్టు సమాచారం. కాగా, ఈ నెల 18న హైదరాబాద్ లో బీజేపీ బహిరంగ సభ జరగనుంది. నాంపల్లిలో నిర్వహించే ఈ సభ ద్వారా టీ-టీడీపీ నేతలు పలువురు బీజేపీలో చేరనున్నట్టు సమాచారం.
 
tags : bjp, chiranjeevi, defection, congress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *