చిరంజీవికి కరోనా.. మరి కేసీఆర్?

Chiru Got Corona What About Kcr?

ప్రముఖ నటుడు చిరంజీవికి కరోనా సోకింది. ఆయన ఆచార్య షూటింగ్ కి హాజరయ్యేందుకు కొవిడ్ పరీక్ష చేసుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్ అని తేలింది. అయితే, తనకు కరోనా లక్షణాలేవి లేవని, హోం క్వారంటైన్ అయ్యానని స్వయంగా చిరంజీవి ఒక ప్రకటన చేశారు. కాకపోతే, ఆయన రెండు రోజుల క్రితమే నటుడు నాగార్జునతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రగతిభవన్లో కలిశారు. అక్కడే ఆయన ఎంపీ సంతోష్ తో పాటు పలువురితో సంభాషించారు. పైగా, ఆ సమావేశంలో కేసీఆర్ నోటికి మాస్కు కూడా పెట్టుకోలేదు. నాగార్జునతో పాటు పక్క పక్కనే నడుస్తూ మాట్లాడుకుంటూ వచ్చిన ఫోటోలు అధికారికరంగా విడుదల చేశారు. మరి, చిరంజీవికి కరోనా సోకిందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సిందేనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *