ఊగిసలాడుతోన్న చిరంజీవి సినిమా

2
chiru movie in confusion
chiru movie in confusion

chiru movie in confusion

కొన్నిసార్లు, కొన్ని సినిమాలకు మనకు బాగా నచ్చొచ్చు. కానీ మంది(ఆడియన్స్)కి నచ్చే అవకాశాలు తగ్గువగా ఉంటాయి. ప్రధానంగా ప్రేక్షకులపైన మాత్రమే ఆధారపడి ఉన్న సినిమా పరిశ్రమలో కొన్ని నిర్ణయాలు ఇలాగే ఇబ్బంది పెడతాయి. అందుకే మెగాస్టార్ చిరంజీవి తీసుకున్న నిర్ణయాన్నే చాలామంది తప్పు పట్టారు. అయనా అతను స్టెప్ వేశాడు. రామ్ చరణ్ నిర్మాతగా అంటూ మళయాలంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ రీమేక్ రైట్స్ ను తీసుకున్నారు. నిజానికి అప్పటికే ఆ సినిమా తెలుగులోనూ డబ్ అయింది. ఇక్కడా విమర్శకులను మెప్పించింది. పొలిటికల్ థ్రిల్లర్ గా వచ్చిన మూవీ.. పైగా తాను పాలిటిక్స్ నుంచి యూ టర్న్ తీసుకున్నాడు కాబట్టి.. చిరంజీవికి ఇది బాగా నచ్చి ఉండొచ్చు. కానీ అది ఆడియన్స్ కు నచ్చుతుందా లేదా అనేది తర్వాతి మేటర్ అయితే.. ఆల్రెడీ రెండు వెర్షన్స్ లోనూ చూశారు. ఇప్పటికీ ఈ సినిమాను అమెజాన్ లో చూస్తున్నవారు ఉన్నారు. అయినా ఈ మూవీ రీమేక్ వైపే మొగ్గు చూపిన చిరంజీవి.. ఇప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నాడుట. సాహో తర్వాత వేరే సినిమా ఏదీ కమిట్ కాకుండా ఉన్న సుజిత్ కు ఈ సినిమా రీమేక్ బాధ్యతలను ఇచ్చారు. అతను కూడా మంచి అవకాశం కాబట్టి.. తెలుగుకు అనుగుణంగా చాలా మార్పులు చేసి.. పూర్తి స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్నాడు.

బట్.. ఈ మధ్య సినిమాకు సంబంధించి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. వీటిలో మొదటిది ఈ ప్రాజెక్ట్ నుంచి సుజిత్ తప్పుకున్నాడని.. కానీ అది నిజం కాదు. అతను తప్పుకోలేదు. ప్రస్తుతం లూసీఫర్ తెలుగు రీమేక్ ను ఆపేద్దాం అనేది మెగా టీమ్ నుంచి వచ్చిన సమాచారం. దీంతో అతను మరోసారి యూవీ క్రియేషన్స్ లో సినిమా చేయడానికి వెళుతున్నాడట. గోపీచంద్ హీరోగా ఈ సినిమా ఉండే అవకాశం ఉందంటున్నారు. అంటే సుజిత్ కు లూసీఫర్ చేయడానికి ఇబ్బందేం లేదు. కానీ మారిన పరిస్థితులను బట్టి.. మెగా టీమ్ నుంచే ఈ ప్రాజెక్ట్ పై అనుమానాలున్నాయి. పైగా చిరంజీవి ఇప్పుడు చేస్తోన్న ఆచార్య ఎప్పుడు పూర్తవుతుందోచెప్పలేని పరిస్థితి. ఆ తర్వాత లూసీఫర్ కు వెళ్లాలి. ఇక ఈ ఆచార్య గ్యాప్ లో సుజిత్ సింపుల్ గా గోపీచంద్ తో సినిమా చేయొచ్చు. పైగా అతనికి కథ కూడా సిద్ధంగా ఉందనేది లేటెస్ట్ టాక్. సో.. ఆ తర్వాత మళ్లీ ఈ రీమేక్ లైన్లోకి రావొచ్చేమో కానీ.. ఇప్పటికైతే లూసీఫర్ దాదాపుగా ఆగిపోయినట్టే అనుకోవచ్చు.

tollywood news