చిదంబరానికి సుప్రీం షాక్ … బెయిల్ నిరాకరణ

Chitambaram supreme shock – Bail Rejected

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది . ఐఎన్ ఎక్స్ కేసులో చిదంబరానికి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఈడీ చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు మార్గం సుగమమయింది. సీబీఐ విచారణ పూర్తయిన తర్వాత ఈడీ చిదంబరాన్ని అరెస్టు చేయనుంది. కేసు డెయిరీని ప్రవేశపెట్టేందుకు కూడా సుప్రీంకోర్టు ఈడీకి అనుమతిచ్చింది. ఆర్థిక నేరాల్లో మాత్రమే అత్యంత అరుదుగా ముందస్తు బెయిల్‌ను ఉపయోగించుకోవాలని, వాస్తవాలను, పరిస్థితులను పరిశీలించిన మీదట ఈ కేసు ముందస్తు బెయిల్‌ పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు పేర్కొంది. దర్యాప్తు చేస్తున్న సంస్థలు తమ దర్యాప్తును కొనసాగించడానికి వీలుగా స్వేచ్ఛనివ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సమయంలో ముందస్తు బెయిల్‌ ఇవ్వడం వల్ల దర్యాప్తుపై ప్రభావం పడుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది . అందుకే చిదంబరానికి బెయిల్ ఇవ్వటానికి నిరాకరించింది అత్యున్నత న్యాయస్థానం.

COLD War on Medical College

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *