పౌర‌స‌త్వ ర‌భ‌స

Citizenship Amendment Bill
పెద్ద‌ల స‌భ‌కు ఒక బిల్లు ఈ రోజు రానుంది. పౌర‌స‌త్వ బిల్లుపై కొద్ది రోజులుగా జ‌రుగుతున్న ర‌భ‌స‌కు ఇది కొన‌సాగింపు కానుందో లేదో కూడా తేలిపోనుంది. శివ‌సేన వ‌ద్దంటోంది.. ఈశాన్యం కాదంటోంది.. అయినా బీజేపీ కొత్త‌గా ఈ బిల్లు తెచ్చి ఈ దేశాన్ని ఉద్ధ‌రించేది ఏముంద‌ని క‌మ్యూనిస్టులు క‌న్నెర్ర జేస్తున్నారు. ఇవేవీ ప‌ట్టించుకోక ప్ర‌ధాని త‌న ప‌ని తాను చేసుకునిపోతున్నారు.
పెద్ద‌ల స‌భ‌లో ఈ బిల్లు గ‌ట్టెక్కితే గండం గ‌ట్టెక్కిన‌ట్లే అన్న విధంగా మోడీ  – షా ద్వ‌యం అనేక ప్రార్థ‌న‌లు చేస్తోంది. మ‌తం ఆధారంగా పౌర‌స‌త్వం ఇవ్వ‌డంపైనే ఈశాన్యం అభ్యంత‌రం చెబుతోంది. మ‌రి! కాంద‌శీకులు శ‌ర‌ణార్థులు ఏళ్ల త‌ర‌బ‌డి ఇత‌ర దేశాల నుంచి ఇటుగా వ‌చ్చిన వారికి పౌర స‌త్వ జారీపై ఎటువంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌నుందో కేంద్రం అన్న‌ది ఇప్ప‌టి ప్ర‌శ్న. ఎప్ప‌టిలానే పాత మిత్రులు అయిన టీడీపీ, బీజూ జ‌న‌తాద‌ళ్ తో పాటు కొత్త మిత్రులు అయిన వైఎస్సార్సీపీ వైపు సైతం బీజేపీ బాస్ చూస్తున్నార‌ని, వారి మ‌ద్ద‌తు అత్యావ‌శ్య‌కం అయిన త‌రుణాన  వీరిని ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో అంతా ఉన్నార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు క‌మ్యూనిస్టు నేత‌లు సైతం మ‌తం ఆధారంగా దేశాన్ని విభ‌జ‌న చేసేందుకు బీజేపీ పెద్ద‌లు ప్ర‌య‌త్నిస్తున్నారని మండిప‌డుతున్నారు.

Citizenship Amendment Bill,#WhatisCAB,Parliament Session Live, Lok Sabha passes Citizenship Bill,#PMModi,#AmitShah,#Shivasena,Delhi Politics,Citizenship Bill Live Updates,Defence of Citizenship Amendment Bill 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *