Clashed Trs leaders at ambarpet
గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తుండటంతో టీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరు మొదలయ్యాయి. మాకంటే మాకే… టికెట్ ఇవ్వాలంటూ నాయకులు, కార్యకర్తలు ఘర్షణలకు దిగుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ముషిరాబాద్ లో హోంమంత్రి సమక్షంలో టీఆర్ఎస్ నాయకులు కొట్టుకున్నారు. ముఖ్య నేతలు కలుజేసుకొని సమస్యను సద్దుమణిగేలా చేశారు. తాజాగా అలాంటి సంఘటన అంబర్ పేట్ డివిజన్లో జరిగింది. డివిజన్ కార్యకర్తల సమావేశికి ఎమ్మెల్యే వెంకటేశ్, పరిశీలకుడు కార్తీక్ రెడ్డి హాజరయ్యారు. అక్కడ కార్యకర్తులు ఉద్యమకారులకే టికెట్లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో సమావేశంలో రసాభాసగా మారింది.