త్రివిక్రమ్ తో ఆ నటుడుకి చెడిందా..?

clashes between trivikram and murali sharma

త్రివిక్రమ్ శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పండగ సందర్భంగా బిగ్గెస్ట్ హ్యాట్రిక్ కొట్టిన త్రివిక్రమ్ ఈ సినిమా కోసం ఓ రేంజ్ లో ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు.  ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ సగర్వంగా చెప్పుకుంటున్నారు కూడా. చివరికి చిన్న పాత్రలు చేసిన సునిల్, నవదీప్ వంటి నటులతో కూడా త్రివిక్రమ్ ప్రమోషన్స్ లో కనిపిస్తున్నాడు. కానీ అల్లు అర్జున్ తర్వాత అంత కీలకమైన పాత్ర చేసిన మురళీ శర్మ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడే కాదు.. సినిమా విడుదలకు ముందు కూడా మురళీశర్మ ఎక్కడా కనిపించలేదు. ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోలేదు కూడా. కానీ మురళీ శర్మ ఈ సినిమా విజయంలో మెయిన్ పిల్లర్స్ లో ఒకడు అనేది నిజం. మరి అలాంటి కీలక నటుడుని త్రివిక్రమ్ ఎందుకు పట్టించుకోవడం లేదు..?

మురళీశర్మను త్రివిక్రమ్ పట్టించుకోకపోవడానికి కారణాలున్నాయట. ఈ ఇద్దరి మధ్య సినిమా షూటింగ్ టైమ్ లోనే కొన్ని ఈగో క్లాషెస్ వచ్చాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. నిజానికి ఈ పాత్రలో ముందుగా అనుకున్న నటుడు రావు రమేష్. అందుకోసం అతని బల్క్ డేట్స్ కూడా తీసుకున్నారు. కానీ చివరి నిమిషంలో మురళీశర్మను తీసుకున్నది త్రివిక్రమ్. మరి అతనికి అంత ప్రియారిటీ ఇస్తే మళ్లీ ఈ ఈగో క్లాషెస్  ఏంటనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. కొన్ని రిలయబుల్ సోర్సెస్ ద్వారా తెలిసిన విషయాన్ని బట్టి.. త్రివిక్రమ్ ఈగో హర్ట్ అయ్యేలా మురళీ వర్మ ప్రవర్తించాడు అంటున్నారు. ఆ కారణంగానే షూటింగ్ పూర్తయిన వెంటనే మురళీకి ఈ సినిమాతో ఏ సంబంధం లేకుండా చేశాడు అంటున్నారు. అటు మురళీ కూడా ఎక్కడా ఈ సినిమా గురించి మాట్లాడ్డం లేదు. మరి మధ్య ఏం జరిగింది అనేది అంత సులువగా బయటకు రావు కానీ.. మొత్తంగా మురళీ శర్మ ఇంత పెద్ద సెలబ్రేషన్ ను మిస్ అయ్యాడనే చెప్పాలి.

clashes between trivikram and murali sharma,Ala Vaikunthapurramuloo,Murali Sharma,Why Murali Sharma Not Attend Success Meet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *