నిలోఫర్ లో క్లినికల్ ట్రయల్స్ వెనక ఎవరు?

CLINICAL TRIALS IN NILOUFER HOSPITAL

ధన్వంతరి వారసులుగా చిన్నారులు ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు క్లినికల్ ట్రయల్స్ తో చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. డబ్బులకు ఆశపడి ప్రయోగ దశలోనే ఔషధాలను వ్యాక్సిన్ ను రహస్యంగా చిన్నారులపై ప్రయోగిస్తున్నారు. వాటి వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి పట్టించుకోకుండా నీలోఫర్ ఆసుపత్రిలో చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారని బయటకు వార్త సంచలనం సృష్టించింది. దీంతో నీలోఫర్ ఆసుపత్రి చిన్నారులను తీసుకెళ్లి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.హైదరాబాద్‌లోని నీలోఫర్ హాస్పిటల్‌లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారని ఫార్మా కంపెనీలు కొత్తగా రూపొందించిన ఔషధాలు, వ్యాక్సిన్లను గుట్టు చప్పుడు కాకుండా పిల్లలపై ప్రయోగిస్తున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలియకుండా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. నీలోఫర్‌లోని కొందరు డాక్టర్లు ఇందుకు సహకరిస్తున్నారని, నిషేధిత డ్రగ్స్ కూడా క్లినికల్ ట్రయల్స్‌లో వాడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

నీలోఫర్‌‌లో క్లినికల్ ట్రయల్స్ విషయమై తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో.. ఈ ఘటనపై విచారణ జరపాలని వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరు డాక్టర్లు గొడవ పడటంతో క్లినికల్ ట్రయల్స్ వ్యవహారం బయటకు పొక్కింది. క్లినికల్‌ ట్రయల్స్‌ చేసినందుకు కొందరు డాక్టర్లకు ఫార్మా కంపెనీలు భారీ మొత్తం ముట్టజెప్పినట్టు సమాచారం. గత కొన్నాళ్లుగా ఈ వ్యవహారం నడుస్తున్నప్పటికీ.. అధికారులెవరూ గుర్తించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటివరకు 50 మంది పిల్లలపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరిగినట్టు తెలుస్తోంది. ఫార్మా కంపెనీలతో కలిసి పిడియాట్రిక్స్‌ విభాగంలో పనిచేసే ఓ ప్రొఫెసర్‌ అనధికారికంగా క్లినికల్ ట్రయల్స్‌ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. సదరు ప్రొఫెసర్ పిల్లలకు వ్యాక్సిన్లు ఇవ్వడంతోపాటు.. తల్లిదండ్రులకు తెలియకుండా వారి రక్త నమూనాలు సేకరించారని సమాచారం. క్లినికల్‌ ట్రయల్స్‌ తాను అన్ని అనుమతులు తీసుకున్నానని ఆ ప్రొఫెసర్ చెబుతుండటం గమనార్హం.  ఏది ఏమయినప్పటికీ చిన్నారులు ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే ఆసుపత్రిలో చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతూ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తుండటం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెళ్లాలంటేనే భయంగా ఉంది అంటూ ఆవేదన చెందుతున్నారు. ఇక ఇలాంటి జరగకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

tags: nielopher hospital, hyderabad, clinical trails, pharma companies, doctors,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *