నలుగురు పెళ్ళాలపై సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు

Cm Jagan Comments on Pawan Wives In Assembly

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. అటు అధికార వైసీపీ ఇటు ప్రతిపక్ష టిడిపి నేతల మధ్య మాటల యుద్ధం అలా ఉంచితే, సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళల భద్రతపై జరుగుతున్న చర్చను ఉద్దేశించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. కొందరు పెద్దపెద్ద నాయకులు నలుగురు పెళ్ళాలు కావాలని తాపత్రయపడుతున్నారు అధ్యక్ష అంటూ చేసిన వ్యాఖ్యలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించే అని ఏపీలో చర్చ జరుగుతోంది .ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ జగన్ మాట్లాడుతూ మహిళలపై జరుగుతోన్న నేరాల గురించి ప్రస్తావించారు. ‘మహిళలపై దాడుల నిరోధానికి సలహా ఇవ్వమని అడిగితే చంద్రబాబు నాయుడు మా వైపు వేలెత్తి చూపిస్తున్నారు తప్పా ఏమీ సలహా ఇవ్వట్లేదు. ఆరు నెలల్లో ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదని అంటున్నారు’ అని అన్నారు.’శాంతి, భద్రతలు లేకుండా పోయిందని అంటున్నారు. మా ప్రభుత్వం వచ్చి ఆరు నెలలే అయింది.

2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పరిపాలన కొనసాగింది. ఆయన కాలంలో మహిళలపై వేలాది నేర కేసులు నమోదయ్యాయి. మహిళలపై అత్యాచారాలు, వేధింపులు, వరకట్నం కేసులు వంటివి ఎన్నోనమోదయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో నేరాల రేటు అధికంగా ఉందని జగన్ పేర్కొన్నారు. ‘చిన్నపిల్లలపై జరిగిన నేరాలపై కూడా వేలాది కేసులు నమోదయ్యాయి. ఇంక కొందరు ఉన్నారు అధ్యక్షా పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొంత మంది పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ మధ్య కాలంలో అధ్యక్షా.. ఒకరు సరిపోరు.. ఇద్దరు సరిపోరు.. ముగ్గురు సరిపోరు.. నలుగురు పెళ్లాలు కావాలని తాపత్రయపడుతున్నారు అధ్యక్షా.. ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారిపై 2014 నుండి 2019 మధ్యలో వందలాది కేసులు నమోదయ్యాయి అధ్యక్షా’ అని సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తానికి తనపై మాటల దాడి చేస్తున్న పవన్ కళ్యాణ్ టార్గెట్ గా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది.

Cm Jagan Comments on Pawan Wives In Assembly,AP Assembly Session,#JaganMohanReddy#PavanKalyan ,WomenProtection ,#Chandrababu 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *