సీపీఆర్వో పై  జగన్ ఆగ్రహం

CM JAGAN FIRE ON CPRO

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో తాజా పరిణామాల నేపధ్యంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఆయన తనకి సంబంధించిన పీఆర్ టీమ్ సరిగా పని చేయడం లేదనే అభిప్రాయాలు మొదటి నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలకు తగిన ప్రచారాన్ని కల్పించడంలో ఏపీ సీఎం పీఆర్వోలు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదనే అభిప్రాయాలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచినే వినిపిస్తూ ఉన్నాయి.వంద రోజుల పాలనలోనే జగన్ మోహన్ రెడ్డి కొన్ని గణనాత్మకమైన మార్పులను తీసుకువచ్చారు. అభినందనీయమైన చర్యలను చేపట్టారు.  అయితే అలాంటి పాజిటివ్ పాయింట్లకు పెద్దగా ప్రచారం రావడం లేదు. అయితే ఏదైనా చిన్న చిన్న సంఘటనలు  ఉంటే మాత్రం వాటికి ఎక్కువ ప్రచారం వస్తూ ఉంది.
ఇంత పెద్ద రాష్ట్రంలో చిన్న చిన్న సంఘటనలు మామూలే . కానీ  వాటిపై తెలుగుదేశం పార్టీ తీవ్రమైన నెగిటివ్ ప్రచారం సాగిస్తూ ఉంది. అయితే పాజిటివ్ అంశాల గురించి ప్రభుత్వంలోని వర్గాలు సరైన ప్రచారం కల్పించలేకపోతూ ఉండటం గమనార్హం.ప్రభుత్వం చేసిన మంచి పనులను సరిగా ప్రచారం చేసుకోలేకపోతే ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ప్రచారం అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం గురించి కాదిక్కడ. పీఆర్వోలు మీడియాను కో ఆర్డినేట్ చేసుకోవడం. చేసిన పనులను ప్రజలకు చేరువయ్యేలా చేయడం కూడా పీఆర్వోల బాధ్యతే. అయితే ఈ విషయంలో సీపీఆర్వో శ్రీహరి పూర్తిగా విఫలం అయినట్టుగా తెలుస్తోంది.ఈ విషయంపై జగన్ మోహన్ రెడ్డి కూడా ఆగ్రహించినట్టుగా సమాచారం. ‘అసలేం జరుగుతోంది.. నెగిటివ్ పబ్లిసిటీ ఎలా స్ప్రెడ్ అవుతోంది – మంచి పనులకు ఎందుకు ప్రచారం రావడం లేదు..’ అంటూ జగన్ మోహన్ రెడ్డి ఆ అధికారిని నిలదీసినట్టుగా తెలుస్తోంది. బెల్ట్ షాపుల రద్దు – భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ – ఇతర సంక్షేమ పథకాల నుంచి ఎందుకు పాజిటివ్ ప్రచారం సాగటం లేదని  ఈ విషయంలో సీపీఆర్వో శ్రీహరి ఫెయిల్యూర్ గురించి సీఎం  జగన్  సీరియస్ అయినట్టు తెలుస్తుంది. .
WHY JAGAN FIRE ON PRO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *