సీఎం జగన్ రెడ్ జోన్

cm jagan in redzone

ఔను మీరు చదివింది కరెక్టే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నివసించే ప్రాంతం రెడ్ జోన్ పరిధిలోకి వచ్చింది. ఎలాగో తెలుసా? తాడేపల్లి పాత టోల్ గేట్ వద్ద మారుతి అపార్ట్మెంట్ లో నివాసం ఉండే ఒక మహిళ (62) మృతి చెందింది. వాస్తవానికి, అనారోగ్యంతో విజయవాడలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.  ఆ తర్వాత టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. సీఎం జగన్ నివాసానికి కూతవేటు దూరంలోనే మృతి చెందిన మహిళ నివాసం ఉండటంతో బఫర్ జోన్ నుంచి రెడ్ జోన్ లోకి మారిన సీఎం జగన్ నివాసం ప్రాంతం. దీంతో, ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు అవాక్కయినట్లు తెలిసింది. అయినప్పటికీ, అక్కడి పోలీసులు, ప్రభుత్వ అధికారులు అన్నిరకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని సమాచారం.

 

ap cm jagan updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *