ఏపీలో రైతు భరోసా పథకం ప్రారంభానికి మోడీని ఆహ్వానించిన సీఎం జగన్ 

Spread the love
CM Jagan invited Modi to launch the farmer reassurance scheme in AP

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రధాని మోదీ తొలిసారి ఏపీ పర్యటనకు రానున్నారు. గత వారం ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లిన సమయంలో తమ ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా కార్యక్రమ ప్రారంభానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనికి ప్రధాని మోదీ సైతం అంగీకరించారు. అక్టోబర్ 15వ తేదీ దీనికి ముహూర్తంగా ఖరారు చేసారు. ఎన్నికలకు రెండేళ్ల ముందుగానేు పార్టీ ప్లీనరీలో పార్టీ అధినేత జగన్ నాడు వైయస్సార్ రైతు భరోసా ప్రకటించారు. రైతుకు రూ. 12,500 వేలు ఇచ్చేలా ప్రకటన చేసారు. దీంతో పాటుగా అదే రోజున అనేక ఇతర పధకాల ప్రారంభానికి ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇక, వచ్చే నెల నుండి జిల్లాల్లో పర్యటనలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ డిసైడ్ అయ్యారు. మంత్రులు..ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉండాలని సీఎం అదేశించారు.
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్..ప్రధాని మోదీకి ఏపీకి రావాలని ఆహ్వానించారు. ఏపీలో నవరత్నాల్లో భాగంగా ప్రకటించిన వైయస్సార్ రైతు భరోసా పధకం ప్రారంభానికి రావాల్సిందా గత వారం ఢిల్లీ పర్యటనలో ప్రధానితో సమావేశమైన సీఎం జగన్ ఆహ్వానించగా ..ప్రధాని అంగీకరించారు. అక్టోబర్ 15న రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ప్రారంభిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. రైతు భరోసా కింద రైతుకు ఏడాదికి రూ. 12,500 పెట్టుబడి సాయం కింద అందించనున్నారు. అయితే, ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ లో ప్రతీ రైతుకు ఏడాది కి రూ 6000 సాయం అందించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు కేంద్రం ఇస్తున్న సాయంతో పాటుగా ఏపీ ప్రభుత్వం మరో రూ.6,500 కలిపి రైతులకు అందివ్వనుంది. దీంతో.. పధకం ప్రారంభోత్సవానికి ప్రధానిని సైతం పిలవాలని జగన్ నిర్ణయించారు. ప్రధాని మోదీని ఆహ్వానించగా..వస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు. ఏపీలో అధికారంలోకి వచ్చి మూడు నెలలు పూర్తి కానుండటంతో ఆగస్టు 15న గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించనున్నారు. అదే విధంగా ఇతర పధకాల అమలు షెడ్యూల్ ను ముఖ్యమంత్రి ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *