ముఖ్యమంత్రి పెద్ద నేరానికి పాల్పడ్డాడు?

CM KCR COMMITTED MAJOR CRIME

టిఆర్‌ఎస్‌కు సీపీఐ మద్దతు ఉపసంహరించుకోవడాన్ని కాంగ్రెస్ స్వాగతిస్తోందని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి తెలిపారు. హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో టిఆర్‌ఎస్‌కు ఇచ్చిన మద్దతును వెనక్కి తేసుకోవాలని సిపిఐ తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. క్రూరమైన, నియంతృత్వ, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీకి మద్దతు ఇవ్వకూడదని సిపిఐ మంచి నిర్ణయం తీసుకుందన్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు దిగిన 48 వేల మందికి పైగా ఉద్యోగులను చట్టవిరుద్ధంగా తొలగించడం ముఖ్యమంత్రి పెద్ద నేరానికి పాల్పడ్డట్లేనని తెలిపారు.  సిపిఐ నిర్ణయం తీసుకోవడం వల్ల కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ అంతటా ప్రభావం పడుతుందని విశ్లేషించారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డిని ఎన్నుకోవాలని హుజుర్‌నగర్ ప్రజలు ఇప్పటికే నిర్ణయించారని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌కు సీపీఐ మద్దతు ఉపసంహరించుకోవడంతో అధికార పార్టీకి ఘోరమైన ఓటమి తప్పదని హెచ్చరించారు.

HUZURNAGAR UPDATES

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *