ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు నేడు తేలనుంది…

CM KCR Decision on RTC in Cabinet Meeting

తెలంగాణ వ్యాప్తంగా గత రెండు నెలలుగా ఆర్టీసీ సమ్మె కొనసాగింది. దీనిపై సీఎం కెసిఆర్ వ్యవహారశైలి ఒకలా ఉంటె, ఆర్టీసీ యాజమాన్యం మరోలా ప్రవర్తించింది. ఆర్టీసీ సంస్థని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రతిపాదనను పెట్టారు. అయితే అది కుదరదంటూ తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే దీనిపై న్యాయస్థానం సైతం ప్రభుత్వాన్నే సప్పోర్ట్ చేస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు ఆర్టీసీ సైతం తమ సమ్మెకు ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే నేడు ఆర్టీసీ పరిస్థితిపై సీఎం కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. నేడు మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ కేబినెట్‌ భేటీ జరుగనుంది. ఈ భేటీలో ఆర్టీసీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే సీఎం తీసుకునే నిర్ణయంపైనే ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇక ఈ భేటీలో ఆర్టీసీ సమ్మె, ప్రైవైటు రూట్‌ పర్మిట్లు, నూతన రెవెన్యూ చట్టంపై చర్చించనుంది తెలంగాణ కాబినెట్.

CM KCR Decision on RTC in Cabinet Meeting,Amidst speculations,Telangana Cabienet Meeting,TSRTC,RTC Strike,RTC Will In Govt,Telangana News,CM KCR,KCR About RTC,Today Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *