సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన

CM KCR Going to Yadhadri ..పునర్నిర్మాణ పనులపై సమీక్ష

రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అయిన యాదాద్రిని ఆధ్యాత్మిక కేంద్రం గా తీర్చి దిద్దాలని కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రికి వెళ్లనున్నారు. ఆలయంలో జరుగుతున్న పునర్నిర్మాణ పనులను పరిశీలించేందుకు రానున్నారు . ఫిబ్రవరి 03వ తేదీ ఆదివారం యాదాద్రికి కేసీఆర్ వెళ్లి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ, విస్తరణ పనులు పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. యాదాద్రి ఆలయాన్ని మరింత ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దేలా దిశానిర్దేశం చేస్తారు.
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దేవాలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దివ్యక్షేత్రంగా రూపొదిద్దుకుంటున్న యాదాద్రి దేవాలయ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో కేసీఆర్‌ సమీక్షిస్తారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునర్నిర్మాణ పనుల్లో మూడువేల మంది పాల్గొంటున్నారు. ఇప్పటికే దేవాలయం శోభాయమానంగా మారి, దేదీప్యమానంగా వెలుగొందుతోంది. శిల్పకళా వైభవంతో నిర్మించిన గోపురాలతో యాదాద్రి ఆలయం కొత్త ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *