17న హుజూర్ నగర్లో సీఎం భారీ బహిరంగ సభ 

cm kcr meeting in huzurnagar on 17th

ఈ నెల 21 హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.  ఈ నేపధ్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వ పథకాల గురించి తెలియజేస్తున్నారు. హుజూర్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ ఎన్నికల ఇంచార్జి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి.. ఎంపీ నామా నాగేశ్వర్‌ రావుతో కలిసి ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 17వ తేదీన హుజూర్‌నగర్‌లో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

ఈ సమావేశంలో ఇక్కడ జరిగే అభివృద్ధి గురించి సీఎం మాట్లాడుతారని , సీఎం బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని ఈ సందర్భంగా రాజేశ్వర్‌ రెడ్డి విన్నవించారు. ఎంపీ నామా నాగేశ్వర్‌ రావు మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. రైతుబంధు, రైతుభీమా, రోజుకు 24 గంటల విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన తెలిపారు. ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్  ప్రభుత్వం. ఉత్తమ్‌ నేతృత్వంలో హుజూర్‌నగర్‌ అభివృద్ధి కుంటుపడిందని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే అభివృద్ధికి ఓటేసినట్లేనని ఈ సందర్భంగా ఎంపీ అన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని  కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ఆయన  ప్రజలకు తెలియజేశారు.

tags : huzur nagar, by poll, cm kcr, public meeting, palla rajeshwar reddy, nama nageshwar rao

http://tsnews.tv/has-new-municipal-act-commenced/
http://tsnews.tv/kcr-rule-or-tughlaq-rule/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *