కాళేశ్వరం ప్రారంభానికి రండి

Spread the love

CM KCR MET JAGAN

  • ఏసీ సీఎం జగన్ ను ఆహ్వానించిన కేసీఆర్
  • తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన తెలంగాణ సీఎం
  • విభజన సమస్యలపై ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రుల చర్చలు

తెలంగాణ జీవరేఖ అయిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు. ఈనెల 21న జరగబోయే ప్రాజెక్టు ప్రారంభానికి తప్పనిసరిగా రావాలని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను జగన్ ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు సీఎంలు కలిసి భోజనం చేశారు. కేసీఆర్‌ వెంట టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌, మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలంటూ జగన్‌ కు కేసీఆర్ ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన సమస్యలపై ఇరువురూ చర్చించినట్టు తెలుస్తోంది. విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9, 10లోని అంశాలను పరిష్కరించేందుకు ఇద్దరు సీఎంలు చొరవ తీసుకుంటున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఇరువురూ కలిసి శారదాపీఠంలో జరుగుతున్న ఉత్తరాధికారి సన్యాసాస్రమ దీక్షా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. అంతకు ముందు విజయవాడ వచ్చిన కేసీఆర్‌.. నేరుగా ఇంద్రకీలాద్రికి వచ్చిన దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయంలో ఏపీ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌.. కేసీఆర్‌కు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ డిజైన్‌, ఆహ్వాన పత్రికను అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు అరగంట పాటు కేసీఆర్‌ ఆలయంలో గడిపారు. అక్కడి నుంచి నేరుగా జగన్ నివాసానికి వచ్చారు.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *