Cm Kcr New revenue act bill passed
ధరణి పోర్టల్ లో మార్పులు చేసే అధికారం తహసీల్లార్లకు కూడా లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. బయోమెట్రిక్, ఐరిష్, ఆధార్, ఫొటోతో సహా అన్ని వివరాలు ఎంట్రీ చేస్తేనే ధరణిలో మార్పులకు అవకాశం ఉంటుందని అన్నారు. కొత్త రెవెన్యూ చట్టం వల్ల అరగంటలోనే రిజిస్ర్టేషన్, మ్యుటేషన్, అప్ డేషన్ ప్రక్రియ పూర్తి చేసే వ్యవస్థ వచ్చిందన్నారు. రెవెన్యూ కోర్టుల స్థానంలో ఫాస్ట్ ట్రాక్ ట్రైబునల్ లు పనిచేస్తాయని అన్నారు.
పేద రైతులకు ప్రయోజనంతో పాటు ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా, మూడేళ్ల కష్టపడి కొత్త రెవెన్యూ చట్టం తయారు చేశామని స్పష్టం చేశారు. మండలిలో కొత్త రెవెన్యూ బిల్లును ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడారు.