సీఎం కేసీఆర్ ని జైల్లో ఎందుకు పెట్టాలి?

cm kcr should put in jail

తెలంగాణలో టీఆర్ఎస్  ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు జరగని రీతిలో ఇప్పుడు పెద్ద ఎత్తున ఆర్టీసీ సమ్మె జరుగుతుంది. ఒక ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చిన కానీ, ఆర్టీసీ సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయంటే అది ప్రభుత్వ వైఫల్యమా లేక ఆర్టీసీ సంఘాల విడ్డురమైన కోరికల మూలంగా జరుగుతున్నాయా అనేది కొంచం ఆలోచించవలసిన అంశమే. ఆర్టీసీ చేస్తున్న సమ్మెకి ప్రతిపక్ష పార్టీలు అన్ని తమ మద్దతు తెలుపుతున్నాయి.ఇక తాజాగా రేవంత్ రెడ్డి ఆర్టీసీ సంఘాలకి మద్దతు తెలుపుతూ సీఎం కేసీఆర్ ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలే చేశాడు. కేవలం ఆర్టీసీ లో 1200 మంది ఉద్యోగులు మాత్రమే వున్నారని కేసీఆర్ ఎలా చెపుతారు. 35 రోజుల క్రితం సమ్మె నోటీసులు ఇచ్చిన కానీ కనీసం మాట్లాడటానికి ఆయనకి కుదరలేదు. నోటీసులు ఇచ్చి సమ్మె చేస్తున్న వాళ్ళని పట్టుకొని సెల్ఫ్ డిస్మిస్ అంటూ మాట్లాడటం కరెక్ట్ కాదు. సమ్మె చేస్తూ మూడు రోజులు విధుల్లోకి రాకపోతే 48 వేలమందిని ఉద్యోగాల నుండి తొలిగించాలని చూస్తే, సీఎం గా ఆరేళ్ల నుండి ఇన్ని సార్లు కేసీఆర్ సచివాలయంకి వచ్చాడు? దీనిపై పీడీ యాక్ట్ ప్రయోగించి.. అండమాన్ జైల్లో పెట్టాలా? వద్దా అంటూ రేవంత్ కేసీఆర్ కి గట్టి కౌంటర్ ఇచ్చాడు.

tags : tsrtc strike, revanth reddy, cm kcr,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *